
బెస్ట్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో భారత్ కు ఆస్కార్ లభించింది. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ గా ది ఎలిఫెంట్ విష్పరర్స్ నిలిచింది. మహిళా డైరక్టర్ కార్తీకి గోన్సాల్వేస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, గునీత్ మోంగా నిర్మించింది. ఆస్కార్ అవార్డులో కార్తీకి ఈ అవార్డును సగర్వంగా అందుకున్నారు. షార్ట్ ఫిల్మ్ విభాగంలో భారత్ కు దక్కిన తొలి ఆస్కార్ ఇదే కావడం విశేషం. ది ఎలిఫెంట్ విష్పరర్స్ గతేడాది డిసెంబర్ లో నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది.