ఫుడ్ సెఫ్టీ ఆఫీసర్ పరీక్షకు సగం మందే అటెండ్

ఫుడ్ సెఫ్టీ ఆఫీసర్ పరీక్షకు సగం మందే అటెండ్

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సెఫ్టీ ఆఫీసర్(ఎఫ్ఎస్​వో) పోస్టుల భర్తీకి సోమవారం టీఎస్​పీఎస్సీ నిర్వహించిన ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. అయితే, అప్లై చేసిన వారిలో సగం మంది మాత్రమే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్​కు అటెండ్ అయ్యారు. మొత్తం 24 పోస్టులకుగాను16,381 మంది అప్లై చేయగా.. 14,830 మంది అభ్యర్థులు హాల్ టికెట్ డౌన్​లోడ్ చేసుకున్నారు. దీంట్లో ఉదయం10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగిన పేపర్ –1 పరీక్షకు 9,488 (57.92%) మంది అంటెండ్ అయ్యారు. ఇక, మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరిగిన పేపర్ 2కు 9,535 (58.21%) మంది అటెండ్ అయినట్లు టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎస్సీ సెక్రటరీ అనితా రాంచంద్రన్ వెల్లడించారు. మొత్తం 16 జిల్లాల్లో 56 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించామని.. త్వరలోనే ప్రిలిమినరీ ‘కీ’ రిలీజ్ చేస్తామని పేర్కొన్నారు.