ఎఫ్ఆర్ఓ కుటుంబానికి రూ.50 లక్షల చెక్కు

ఎఫ్ఆర్ఓ కుటుంబానికి రూ.50 లక్షల చెక్కు

ఖమ్మం టౌన్, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎర్రబోడు ఘటనలో చనిపోయిన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపుడి గ్రామానికి చెందిన  ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు కుటుంబానికి సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.50 లక్షల పరిహారాన్ని వారి కుటుంబానికి అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్​ ఆఫ్ ఫారెస్ట్ (సీసీఎఫ్​) భీమా నాయక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల డీఎఫ్ఓలు సిద్దార్థ విక్రమ్ సింగ్, రంజిత్ నాయక్ అందజేశారు. శ్రీనివాస రావు భార్యాపిల్లలను ఓదార్చారు.

త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం, ఇతర అన్ని హామీలను అందిస్తామని హామీ ఇచ్చారు. మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, ఎంపీపీ మాలోత్ గౌరి, తహసీల్దార్ నర్సింహారావు, ఎఫ్ఆర్ఓ రాధిక, మంత్రి పీఏ సీహెచ్ రవికిరణ్, నాయకులు మందడపు నర్సింహారావు, కుర్రా భాస్కర్ రావు, కొంటెముక్కల వెంకటేశ్వర్లు, మందడపు సుధాకర్ ఉన్నారు.