భారత్ పాక్ మ్యాచ్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్

భారత్ పాక్ మ్యాచ్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్

కంగారుల గడ్డపై దాయాదుల మధ్య సమరానికి సర్వం సిద్ధమైంది. 2021 టీ20 వరల్డ్ కప్తో పాటు..ఆసియాకప్లో ఎదురైన  ఓటమికి  ప్రతీకారం తీర్చుకోవాలని రోహిత్‌ సేన భావిస్తోంది. కాసేపట్లో ఇరు జట్ల మధ్య బిగ్ ఫైట్ ప్రారంభం కానుంది. మరోవైపు రెండు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారత్ పాక్ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్కు చేరుకుంటున్నారు.

 

ఎంసీజీ దగ్గర ఫ్యాన్స్ సందడి..
భారత్ , పాక్  ఫ్యాన్స్తో మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వద్ద సందడి నెలకొంది. ఆటపాటలతో అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. భారత్ పాక్ మ్యాచ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు ఓ అభిమాని తెలిపాడు. మెల్ బోర్న్ ను చూస్తుంటే...భారత్ లో ఉన్న ఫీలింగ్ కలుగుతుందని చెప్పాడు. మూడు రోజుల క్రితం వచ్చామని...టీమిండియా జెర్సీని మెల్ బోర్న్ వీదుల్లో తిరిగామన్నారు. వరల్డ్ వైడ్ గా ఈ మ్యాచ్ ను చూసేందుకు ప్రేక్షకులు తరలివచ్చారని చెప్పాడు. అన్ని మ్యాచ్ లకు ఈ మ్యాచ్ మదర్ వంటిదని టీమిండియా ఫ్యాన్ చెప్పుకొచ్చాడు. 

అన్ని మ్యాచ్లకు తల్లివంటిది ఈ మ్యాచ్..
భారత్- పాక్  మ్యాచ్.. అన్ని మ్యాచ్‌లకూ తల్లిలాంటిదని పాకిస్తాన్ టాప్ కమేడియన్ మోమిన్ సాకిబ్  చెప్పాడు. భారత్ పాక్ మ్యాచ్ చూసేందుకు చాలా దూరం ప్రయాణం చేసి వచ్చామన్నాడు.  ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టి  భారత్ పాక్ మ్యాచ్ పైనే ఉందన్నాడు. 

గ్రౌండ్ ఫుల్ అయ్యే ఛాన్స్..
చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగే మ్యాచ్ను దాదాపు లక్షమందికిపై గా ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులు సిద్ధమయ్యారు.  మెల్ బోర్న్ గ్రౌండ్ సామర్థ్యం..లక్ష కాగా...ఈ మ్యాచ్ కోసం గ్రౌండ్ ఫుల్ అయ్యే అవకాశాలున్నాయి. దీనికి అనుగుణంగా ఎంసీజే టికెట్లను విక్రయించింది.