ఆందోళనల నడుమ బిల్లుకు ఆమోదం

ఆందోళనల నడుమ బిల్లుకు ఆమోదం

సోమవారం ప్రారంభమైన లోక్ సభ సమావేశాల్లో కేంద్రం మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును ప్రవేశ పెట్టింది. వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ బిల్లును సభలో ప్రవేశ పెట్టారు. దీంతో ఈ బిల్లు రద్దుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. టీఆర్ఎస్ సహా విపక్షాల ఆందోళనల నడుమ రద్దు బిల్లుకు లైన్ క్లియర్ అయ్యింది. మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం తెలిపింది. మరోవైపు సభలో విపక్షాలు తమ ఆందోళనల్ని కొనసాగించడంతో స్పీకర్ ఓం బిర్లా సీరియస్ అయ్యారు. విపక్షాలు ఆందోళనను విరమించాలని కోరారు. అయినా సభ్యులు ఎవరూ వినకపోవడంతో చివరకు సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు. 

లోక్ సభలో వ్యవసాయ చట్టాల రద్దు ఆమోదంపై బికేయు నేత రాకేష్ టికాయత్ స్పందించారు. లోక్‌సభ ఆమోదించిన వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు, ఆందోళన సమయంలో ప్రాణాలు కోల్పోయిన  750 మంది రైతులకు నివాళి అన్నారు. పంటల మద్దతు ధరకు చట్టబద్దత సహా ఇతర సమస్యలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. రైతు ఉద్యమం కొనసాగుతుందన్నారు టికాయత్.