షోరూం  సేల్స్​మెన్​కు బుద్ధి చెప్పిన రైతు

షోరూం  సేల్స్​మెన్​కు బుద్ధి చెప్పిన రైతు
  • ‘నువ్వేం కొంటవ్​ తీ’’ అంటే..సవాల్​ చేసి 10 లక్షలు తెచ్చిండు
  • కర్నాటకలో షోరూం సేల్స్​మెన్​కు బుద్ధి చెప్పిన రైతు 
  • డెలివరీ వెంటనే ఇవ్వలేమంటే..కొనకుండానే వెళ్లిపోయిండు

బెంగళూరు: మహీంద్రా షోరూమ్​లో బొలెరో పికప్ ట్రక్ కొనేందుకు వెళ్లిన ఓ రైతును సేల్స్ మెన్​అవమానించాడు. ‘‘జేబులో 10 రూపాయలుండవు, రూ.10 లక్షల కారు కొంటాడట” అంటూ హేళన చేశాడు. సవాలుగా తీసుకున్న ఆ రైతు అరగంటలో రూ.10 లక్షలతో వచ్చి సేల్స్ మెన్​కు బుద్ధి చెప్పాడు. కర్నాటకలోని తుమకూరులో శుక్రవారం జరిగిన ఈ ఘటన వీడియో వైరల్‌‌‌‌ అయింది. ఆ వీడియోను నెటిజన్లు మహీంద్రా గ్రూప్ ​చైర్మన్​ఆనంద్ ​మహీంద్రాకు ట్యాగ్​ చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే..
కర్నాటకలోని తుమకూరు ఏరియాకు చెందిన కెంపెగౌడ అనే ఓ సాధారణ రైతు బొలెరో పికప్ ట్రక్ కొనాలనుకున్నాడు. వివరాల కోసం ఫ్రెండ్స్​తో కలిసి మహీంద్రా షోరూమ్​కు వెళ్లాడు. అక్కడ పనిచేస్తున్న ఓ సేల్స్ మెన్ రైతు వేషధారణ చూసి హేళన చేశాడు. ‘జేబులో రూ.10 కూడా ఉండదు.. కానీ,  రూ.10 లక్షలు పెట్టి వెహికిల్ ​కొంటాడట’’ అని అవమానించాడు. దాన్ని సవాల్​గా తీసుకున్న రైతు.. ‘10 లక్షలు పట్టుకొస్తే వెంటనే బండి డెలివరీ చేస్తావా’’ అని సవాలు విసిరి షోరూం నుంచి వెళ్లిపోయాడు. 30 నిమిషాల తర్వాత రూ.10 లక్షలతో తిరిగి వచ్చిన రైతు.. తనకు కావాల్సిన బండి వెంటనే డెలివరి చేయాలని డిమాండ్ చేశాడు. షాక్​తిన్న సేల్స్​మెన్.. 2 రోజులు టైమ్ కావాలన్నడు. సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఎట్టకేలకు కెంపెగౌడకు క్షమాపణలు చెప్పాడు. ‘‘మీ షోరూమ్​లో కారు కొనడం నాకు ఇష్టం లేదు”అని చెప్పిన రైతు.. రూ.10 లక్షలతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు.