పదేండ్ల కొడుకును కర్రతో చితకబాదిన తండ్రి

V6 Velugu Posted on Nov 28, 2021

పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే.. కొడుకును కర్కషంగా చితకబాదాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా నివసించే అశోక్ అనే వ్యక్తి తన పది సంవత్సరాల కొడుకును ఇంట్లో ఎవరూ లేని సమయంలో కొట్టి గాయపరిచాడు. తప్పయ్యింది పప్పా.. క్షమించు అని కాళ్లావేళ్లా పడినా ఆ కసాయి తండ్రి వినకుండా.. కర్రతో విపరీతంగా కొట్టాడు. ఇంటికి వచ్చిన తల్లి జిజా బాయి.. కొడుకుపై జరిగిన దాడి  తెలుసుకొని ఛత్రినాకా పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Tagged Hyderabad, old city, chatrinaka, father attack on his son

Latest Videos

Subscribe Now

More News