ఏ దేవుడికి.. ఎలాంటి పండ్లు ప్రసాదంగా పెట్టాలి.. ఎలాంటి పుణ్యం వస్తుంది

ఏ దేవుడికి.. ఎలాంటి పండ్లు ప్రసాదంగా పెట్టాలి.. ఎలాంటి పుణ్యం వస్తుంది

మనం సాధారణంగా గుడికి ఖాళీ చేతులతో వెళ్లం... కొబ్బరికాయ…పండ్లు…పువ్వులు…పూజా సామాగ్రిని తీసుకుని వెళ్తాం. అలా వెళ్తే మనస్సు కూడాఎంతో సంతోషంగా ఉంటుంది. మరి ఏ పండును ఆ భగవంతుడిని నైవేద్యంగా సమర్పించాలి. ఏ పండును భగవంతుడిని సమర్పించి.. దానిని ప్రసాదంగా స్వీకరిస్తే  ఎలాంటి ఫలితాన్ని పొందుతామో... తెలుసుకుందాం.

అరటిపండ్లు:  దేవునికి  నైవేద్యంగా పెడితే…నిలిచిన పనులు ముందుకు సాగుతాయని వేదాలు చెబుతున్నాయి. త్వరగా పనులు పూర్తవుతాయని రామాయణంలో ఓ పురాణ గాథ కూడా ఉంది.  హనుమంతుడు సంజీవని చెట్టు కోసం వెళ్లినప్పుడు అది అక్కడ గుర్తించలేదట.. అప్పుడు సాక్షాత్తు శివుడిని ప్రార్ధిస్తే దగ్గరలో ఉన్న దేవాలయంలో అరటి పండును ఆరగించి దానిని ప్రసాదంగా తీసుకోమని ఆదేశించాడని కొన్ని పురాణ గ్రంధాల్లో పేర్కొన్నారు.  అప్పుడు ఆంజనేయుడికి ఇష్టమైన కార్యము నెరవేరిందని పలువురు రుషి పుంగవులు చెబుతున్నారు.

అరటిగుజ్జు:  బుుణవిముక్తికోసం…రావాల్సిన సొమ్ముకోసం…నష్టపోయిన డబ్బు తిరిగి వస్తుందని హేమ పురాణంలో పేర్కొన్నారు. పెళ్లి తదితర శుభకార్యాలయాలకు సకాలంలో నగదు అంది.. ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలంటే అరటి గుజ్జును ఇష్ట దైవానికి నైవేద్యంగా సమర్పించాలని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.   ఇంకా  అరటి గుజ్జును నైవేద్యంగా సమర్పించడం వల్ల  .. అప్పుల బాధ తొలగిపోయి...  హఠాత్తుగా నగదు చేతికి వస్తుందని విష్ణు పురాణంలో పేర్కొన్నారు . 

కొబ్బరికాయ: పనులు సులభంగా పూర్తికావడమే కాకుండా . అనుకున్న రీతిలో పనులు నెరవేరుతాయని శివ పురాణంలో తెలిపారు. పై అధికారుల నుంచి ఎలాంటి సమస్యలు రాకుండా అన్ని పనులు దిగ్విజయంగా జరుగుతాయని పలు ఆధ్యాత్మిక సభల్లో కూడా పలువురు వక్తలు చెప్పారు. 

సపోటాపండు: వివాహాది శుభకార్యాల విషయంలో ఎదురయ్యే చికాకులు దాదాపుగా తొలగిపోతాయని కన్యకా పురాణంలో పేర్కొన్నారు . అమ్మాయిని చూసి వెళ్ళినవారు ఒప్పుకునేందుకు ఆలస్యం చేస్తున్నా ... సంబంధం  చేసుకొనేందుకు అబ్బాయి తరపువారు నిరాకరిస్తే సపోటా పండును దేవునికి నైవేద్య్యంగా పెడితే ఎటువంటి అవాంతరాలు ఉన్న తొలగిపోతాయని కన్యకా పురాణంలో  తెలిపారు.

కమలాఫలం:   పనులు చేసి పెడతామని మాట ఇచ్చి...  తరువాత వేర్వేరు కారణాలతో పనులు నిలిచిపోతే ..కమలాపండును దేవునికి నివేద్యంగా ఉంచితే నమ్మకమైన వ్యక్తుల ద్వారా  పనులు పూర్తిఅవుతాయని శివపురాణంలో తెలిపారు.  చిరకాలంగా నిలిచిపోయిన పనులు నెరవేరుతాయి.

మామిడిపండు:  వినాయకుడికి మామిడిపండును సమర్పిస్తే.. ప్రభుత్వం నుంచి రావలసిన నగదు ఎటువంటి సమస్యలు లేకుండా వస్తుంది గృహ నిర్మాణానికి రావలసిన అప్పు సకాలంలో రాకపోతే ... నగదు చెల్లించవలసిన సమయములో చేతిలో డబ్బు లేకపోతే శ్రీ మహాగణపతికి మామిడి పండు నివేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని అందరికి పంచితే మీకు రావలసిన నగదు సకాలంలో వచ్చి చేరుతుందని లక్ష్మీ పురాణంలో పేర్కొన్నారు.చీటీల వ్యవహారంలో నష్టం వస్తే   అటువంటివారు శ్రీ మహాగణపతి హోమాన్ని చేసి పూర్ణాహుతికి మామిడి పండును నైవేద్యంగా సమర్పిస్తే  మీకు రావలసిన నగదు త్వరగా వస్తుందని కూడా లక్ష్మీ పురాణంలో పేర్కొన్నారు.  మామిడిరసం.. తేనె కలిపి పరమశివుడికి అభిషేకం చేస్తే  మిమ్మలను మోసం చేసిన వారు మీ నగదును తీసుకొచ్చి క్షమాపణలు చెప్పి ఇస్తారని పురాణ గ్రంధాలు చెబుతున్నాయి. 

నేరేడుపండు: నేరేడు పండును నైవేద్యంగా సమర్పిస్తే…నీరసం, నిస్సత్తువ తగ్గుతుందని లక్ష్మీ నరసింహ పురాణంలో పేర్కొన్నారు. శనీశ్వరుడికి ఆరగిస్తే  వెన్ను, నడుం, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయట.. .  భోజనంతోపాటు నేరేడు పండును వడ్డించినట్లయితే…అన్న పానీయాలకు లోటు లేకుండా.... బిచ్చగాళ్లకు దానం చేస్తే దరిద్రం పోయి... పనులు నిరాటంకంగా సాగుతాయని వేద పండితులు చెబుతున్నారు.  

యాపిల్ పండు:  దేవునికి యాపిల్ ను నైవేద్య్యంగా పెడితే శ్రీమంతులు అవుతారని విష్ణుపురాణంలో తెలిపారు..రాజ గౌరవం ప్రాప్తించి ..సంఘంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారని.. ఇంద్రుడు కూడా నిత్యం ఆ రోజుల్లో లభించే యాపిల్ అనగా ఆల్ బకారా పండ్లను దేవుడికి సమర్పించాడని విష్ణుపురాణంలో పేర్కొన్నారు. 

ద్రాక్షపండ్లు:  దేవుడికి నైవేద్యంగా పెడితే సుఖసంతోషాలు కలుగుతాయని దేవీ భాగవతంలో పేర్కొన్నారు.  నైవేద్యం పెట్టిన ద్రాక్ష పండ్లను  చిన్న పిల్లలకు ఇచ్చి తరువాత పెద్దలకు పంచితే సుఖం సంతోషం ఎప్పుడు ఉంటాయని పండితులు చెబుతున్నారు. 

జామపండు: జామపండును నైవేద్యంగా సమర్పిస్తే…సమాజంలో పలుకుబడి పెరుగుతుందని భవిష్య మహాపురాణంలో తెలిపారు. గణపతికి నైవేద్యంగా పెట్టినట్లయితే  సంతాన ప్రాప్తి, దాంపత్య కలహాలు తొలగిపోతాయని బసవ పురాణంలో పేర్కొన్నారు. వివాహం కానీ  ఆడపిల్లలతో  ముత్తయిదువులకు పసుపుబొట్టు పెట్టిస్తే పెళ్లి ఆటంకాలు తొలగిపోతాయని కన్యకా పురాణంలో తెలిపారు. జామ, కమలాపండ్లు రసాలతో రుద్రాభిషేకం చేస్తే పనులు చురుగ్గా ముందుకు సాగుతాయని పండితులు అనేక సందర్భాల్లో పలు ఆధ్మాత్మిక సందర్భాల్లో చెప్పారు. గణపతికి పంచామ్రుత అభిషేకం చేసి జామపండ్లను నైవేద్యంగా పెడితే వ్యాపారం లాభసాటికగా సాగుతుందని  దేవాంగ పురాణంలో పేర్కొన్నారు.