ఈ వారం ఇన్వెస్టర్ల ఫోకస్ అంతా ఫెడ్ మీటింగ్‌‌‌‌‌‌‌‌పైనే

ఈ వారం ఇన్వెస్టర్ల  ఫోకస్ అంతా ఫెడ్ మీటింగ్‌‌‌‌‌‌‌‌పైనే

న్యూఢిల్లీ: ఈ వారం ఇన్వెస్టర్ల ఫోకస్‌‌‌‌‌‌‌‌ అంతా ఫెడ్ మీటింగ్‌‌‌‌‌‌‌‌పై ఉండనుంది.  వడ్డీ రేట్లు తగ్గుతాయని  మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది  ఇండియా వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు సానుకూల అంశం. డిసెంబర్ 9–10న  ఫెడ్ మీటింగ్ జరుగుతుంది.   దీంతో పాటు డిసెంబర్ 12న ఇండియా రిటైల్ ద్రవ్యోల్బణం డేటా వెలువడనుంది.  మార్కెట్‌‌‌‌‌‌‌‌పై ఈ డేటా ప్రభావం ఉంటుంది.   రూపాయి గత వారం డాలర్‌‌‌‌‌‌‌‌కు 90 దాటినందున కరెన్సీ కదలికలు కూడా కీలకం. యూఎస్‌‌‌‌‌‌‌‌ జాబ్ ఓపెనింగ్స్‌‌‌‌‌‌‌‌ (డిసెంబర్ 9), ఎంప్లాయిమెంట్ కాస్ట్ ఇండెక్స్ (డిసెంబర్ 10) వంటి డేటా అమెరికా లేబర్ మార్కెట్ పరిస్థితిని తెలియజేస్తాయి. యూఎస్‌‌‌‌‌‌‌‌ డాలర్ ఇండెక్స్, ట్రెజరీ బాండ్ యీల్డ్స్‌‌‌‌‌‌‌‌లో మార్పులు వంటివి కూడా  మార్కెట్‌‌‌‌‌‌‌‌పై ప్రభావం చూపుతాయని ఎనలిస్టులు భావిస్తున్నారు.  ‘‘ఫెడ్ కామెంట్స్,  ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గైడెన్స్‌‌‌‌‌‌‌‌ వంటివి మార్కెట్ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌ను   ప్రభావితం చేస్తాయి. గ్లోబల్‌‌‌‌‌‌‌‌గా ఒత్తిడి ఉన్నా ఇండియా ఎకానమీ  స్థిరంగా ఉండటంతో, ఫండ్ ఫ్లోలు తిరిగి రావొచ్చు. దీంతో మార్కెట్ లాభపడే అవకాశం ఉంది”అని ఎన్రిచ్ మనీ సీఈఓ పోన్ముడి ఆర్ అన్నారు.  

కొనసాగుతున్న ఎఫ్‌‌‌‌‌‌‌‌పీఐల అమ్మకాలు..

ఈ నెల మొదటి వారం విదేశీ పోర్ట్‌‌‌‌‌‌‌‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌‌‌‌‌‌‌‌పీఐలు) భారతీయ ఈక్విటీల నుంచి నికరంగా రూ.11,820 కోట్లు (1.3 బిలియన్ డాలర్లు) ఉపసంహరించుకున్నారు. రూపాయి విలువ పడిపోవడమే ప్రధాన కారణమని ఎనలిస్టులు చెబుతున్నారు. ఈ ఏడాది నవంబర్‌‌‌‌‌‌‌‌లో నికరంగా రూ.3,765 కోట్లు అవుట్‌‌‌‌‌‌‌‌ఫ్లో కాగా, అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో రూ.14,610 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో రూ.23,885 కోట్లు, ఆగస్టులో రూ.34,990 కోట్లు, జులైలో రూ.17,700 కోట్ల విత్‌‌‌‌‌‌‌‌డ్రా జరిగింది.  ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఇండియా మార్కెట్‌‌‌‌‌‌‌‌ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు నికరంగా రూ.1.55 లక్షల కోట్లు (17.7 బిలియన్ డాలర్లు) ఉపసంహరించుకున్నారు.  అయితే, డొమెస్టిక్ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (డీఐఐలు) మార్కెట్‌‌‌‌‌‌‌‌కు సపోర్ట్‌‌‌‌‌‌‌‌గా నిలుస్తున్నారు. ఈ నెల మొదటి వారంలో  నికరంగా రూ.19,783 కోట్లు ఇన్వెస్ట్ చేశారు.