Nilave Movie: సౌమిత్ పోలాడి హీరోగా మ్యూజికల్ లవ్ డ్రామా.. రిలీజ్ డేట్ అనౌన్స్

Nilave Movie: సౌమిత్ పోలాడి హీరోగా మ్యూజికల్  లవ్ డ్రామా.. రిలీజ్ డేట్ అనౌన్స్

సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన చిత్రం ‘నిలవే’. శ్రేయాసి సేన్ హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి కే వెన్నం నిర్మిస్తున్నారు. 

ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ  చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌‌‌‌ను అనౌన్స్ చేశారు మేకర్స్. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు ప్రకటించారు.

బిగ్గెస్ట్ మ్యూజికల్ లవ్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ప్రేమను సెలబ్రేట్ చేసేలా ఉంటుందని దర్శక నిర్మాతలు తెలియజేశారు. హర్ష చెముడు, సుప్రియా ఐసోలా, రూపేష్ మారాపు, జీవన్ కుమార్, గురురాజ్, సిద్ధార్థ్ గొల్లపూడి ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్  నాయక్ సంగీతం అందిస్తున్నాడు.