ఆకాశం నుంచి చంద్రయాన్2 హై-ఫై

ఆకాశం నుంచి చంద్రయాన్2 హై-ఫై

చంద్రయాన్-2 ఐదు సార్లు కక్ష్య తగ్గింపు ఆపరేషన్ పూర్తయింది. ఈ సాయంత్రం 6 గంటల 21 నిమిషాలకు చంద్రయాన్2 చంద్రకక్ష్యను చివరిసారిగా తగ్గించారు. కీలకమైన కక్ష్య తగ్గింపు ప్రక్రియ దీంతో ముగిసిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సైంటిస్టులు సోషల్ మీడియాలో ప్రకటించారు. సుదూరం నుంచి ఎత్తునుంచి… మీకు చంద్రయాన్ 2  హైఫై చెప్పిందంటూ సంతోషంగా ఈ వార్తను అందించారు శాస్త్రవేత్తలు.

ఇక చంద్రుడిపై స్థిరమైన కక్ష్యలో స్పేస్ క్రాఫ్ట్ ఆర్బిటార్ తిరుగుతుంటుంది. సెప్టెంబర్ 2న అంటే.. రేపు చంద్రయాన్ 2 చంద్రుడిపై 30 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు… విక్రమ్ ల్యాండర్ కు సంబంధించిన ల్యాండింగ్ దశలు ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ 7న విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగుతుంది. ఆ తర్వాత ప్రజ్ఞాన్ రోవర్ పని మొదలవుతుంది.