
- బ్యాంకులకు ఫైనాన్స్ మినిస్ట్రీ సూచన
న్యూఢిల్లీ : ప్రభుత్వ బ్యాంకులు తమ డిజిటల్ ఆపరేషన్స్‌ను ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోవాలని ఫైనాన్స్ మినిస్ట్రీ కోరింది. ఈ నెల 10–13 మధ్య యూకో బ్యాంక్ ఐఎంపీఎస్ ద్వారా రూ.820 కోట్లను కస్టమర్ల అకౌంట్లలో వేసింది. ఇందులో రూ. 649 కోట్లు రికవరీ చేయగలిగింది.
సైబర్ సెక్యూరిటీ మెరుగుపరుచుకోవాలని బ్యాంకులకు ఫైనాన్స్ మినిస్ట్రీ సూచించింది. ఫైనాన్స్ సెక్టార్‌లో డిజిటైజేషన్ పెరుగుతుండడంతో సైబర్ దాడుల నుంచి రక్షించుకోవడానికి సెక్యూరిటీ మెరుగుపరుచుకోవాలని ఆర్‌బీఐ, ఫైనాన్స్ మినిస్ట్రీ బ్యాంకులను ఎప్పటికప్పుడు చెబుతున్నాయి.