ఒక చెరువు.. పది ఊళ్ల జనం..

ఒక చెరువు.. పది ఊళ్ల జనం..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం అనంతారం గ్రామంలోని ఎర్ర చెరువులో నీరు తగ్గిపోవడంతో ఆదివారం ఇలా చేపలు పట్టారు. గిరిజనులకు చేపల వేట అంటే ఎంతో ఇష్టం. ప్రతి ఏటా చెరువు చుట్టుపక్కల ఉన్న సుమారు 10 గ్రామాల ప్రజలకు గిరిజన పెద్దమనుషులు వారం ముందు చేపలు పట్టే రోజును నిర్ణయించి సమాచారం ఇస్తారు. ఆదివారం పది గ్రామాల ప్రజలు తరలివచ్చారు. మొత్తం ఆరు క్వింటాళ్ల వరకు చేపలు దొరికాయి. ఎవరికి దొరికిన చేపలు వారు తీసుకెళ్లారు.                                                                      – కరకగూడెం, వెలుగు