శ్రీరాంసాగర్కు మళ్లీ పెరుగుతున్న వరద

శ్రీరాంసాగర్కు మళ్లీ పెరుగుతున్న వరద
  • ఇన్ ఫ్లో: 62,741 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో: 49,968 క్యూసెక్కులు 

నిజామాబాద్ జిల్లా: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం మళ్లీ పెరుగుతోంది. నిన్నటి వరకు తగ్గుతూ వచ్చిన వరద ప్రవాహం.. మళ్లీ పెరగడం ప్రారంభమైంది. ఇవాళ ఉదయం 6 గంటల సమయంలో ఇన్ ఫ్లో 24 వేల క్యూసెక్కులు ఉండగా.. 11 గంటల సమయానికి రెట్టింపు అయింది. దీంతో 9 గేట్ల ద్వారా నీటి విడుదల చేస్తున్న అధికారులు మరో 9 గేట్లు మొత్తం 18 గేట్లు ఎత్తి దిగువన గోదావరి నదిలోకి నీటి విడుదల చేస్తున్నారు. 
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు, సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం 1088.30 అడుగులతో .. 77.383 టీఎంసీల నీటి నిల్వ కొనసాగిస్తున్నారు. 18 గేట్ల ద్వారా 49 వేల 968 క్యూసెక్కుల వరద దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీరాం సాగర్ కు మళ్లీ వరద పెరిగిన  నేపధ్యంలో నది పరివాహక ప్రాంతాల్లో.. దిగువ ప్రాంతాల వారిని అప్రమత్తం చేశారు అధికారులు.