
- సీఎం శాఖలపై ప్రశ్నలకు జవాబులు చెప్పే బాధ్యతలు..
- నలుగురు మంత్రులకు అప్పగింత
హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ తన వద్ద ఉన్న శాఖలకు సంబంధించి అసెంబ్లీ, కౌన్సిల్లో సభ్యులు అడిగే ప్రశ్నలకు ఆన్సర్లు చెప్పే బాధ్యతను నలుగురు మంత్రులకు అప్పగించారు. ఈ మేరకు ఇరిగేషన్‌పై సభ్యులు అడిగే ప్రశ్నలకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు సమాధానాలు చెప్పనున్నారు. ఇరిగేషన్‌తో పాటు జీఏడీ, లా అండ్ ఆర్డర్‌పై ప్రశ్నలకు కూడా ఆయనే సమాధానాలు చెప్తారు. మైన్స్ అండ్ జియాలజీ, ఐ అండ్ పీఆర్‌పై ప్రశ్నలకు కేటీఆర్ ఆన్సర్లిస్తారు. రెవెన్యూపై ప్రశ్నలకు ప్రశాంత్‌రెడ్డి, కమర్షియల్ టాక్స్‌పై ప్రశ్నలకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సమాధానం చెప్పనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.