సర్పంచ్ నిధులను కేసీఆర్ పక్కదారి పట్టిస్తుండు : జీవన్ రెడ్డి

సర్పంచ్ నిధులను  కేసీఆర్ పక్కదారి పట్టిస్తుండు : జీవన్ రెడ్డి

రాష్ట్రంలో సర్పంచుల నిధులు, హక్కులు కాపాడటం కోసమే తాము ధర్నా చేస్తున్నామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్పారు. గ్రామ స్వరాజ్యంతోనే రాష్ట్రం, దేశం అభివృద్ధి జరుగుతుందన్నారు. కేవలం ఎన్నికల నిర్వహణ ద్వారా అభివృద్ధి జరగదన్న ఆయన.. గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించాలని రాజీవ్ రోజ్ గార్ యోజన ప్రవేశపెట్టారని ఆయన గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తలసరి గ్రాంటు, ఇతర గ్రాంటులు నిలిపివేస్తున్నారని విమర్మించారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోగా, కేంద్రం విడుదల చేసిన నిధులను కూడా పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు.

కనీసం ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ సర్పంచులకైనా నిధులు వెంటనే సమకూర్చాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏకగ్రీవమైనా గ్రామ పంచాయతీలకు సర్కారు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఏకగ్రీవం కాకుండా ఎన్నికల్లో తాగి తందనాలు ఆడితే అబ్కారీ శాఖకు ఆదాయం వస్తుండేనని ప్రభుత్వం ఆలోచిస్తుందని విమర్శించారు. గ్రామ పంచాయతీలకు గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు తప్ప కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒక్క రూపాయి నిధులు రాలేదని చెప్పారు. ఎన్ఆర్ఐజీ నిధులు లేకపోతే ప్రతి సర్పంచ్ రాజీనామాలు చేసేవారని తెలిపారు.