
నిజామాబాద్: జిల్లా జనరల్ ప్రభుత్వాసుపత్రిలో 67 మంది సిబ్బంది భవిషత్తు ఆగమ్యగోచరంగా మారింది. ఫారిన్ సర్వీస్ డిప్యుటేషన్‌పై పని చేస్తున్న ఈ సిబ్బందికి ఏప్రిల్ 30తో గడువు ముగిసింది. నెల రోజులు గడుస్తున్నా ఇంకా ఉత్తర్వులు రాలేదు. దీంతో ప్రభుత్వం నుంచి రెన్యువల్ జీవో వస్తే తప్ప వీరు ఇక్కడ విధులు నిర్వర్తించడానికి అవకాశం లేదు. మే నెల జీతం కూడా తమకు రాలేదని సదరు సిబ్బంది వాపోయారు. సిబ్బంది రినివల్‌పై కలెక్టర్, డీఎంఈకి విన్నవించామని పేర్కొన్నారు. కాగా, సీనియర్ సిబ్బంది వెళ్లిపోతే కరోనా ట్రీట్‌మెంట్‌కు కష్టమవుతుందని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.