- నిజామాబాద్ సిటీ శివారులో ఘటన
నిజామాబాద్, వెలుగు : ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా.. గంజాయి స్మగ్లింగ్ ముఠా కారుతో ఢీ కొట్టడడంతో మహిళా కానిస్టేబుల్తీవ్రంగా గాయపడింది. ప్రమాదం నుంచి సీఐ స్వప్న, 8 మంది కానిస్టేబుళ్లు తప్పించుకున్న ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. స్విఫ్ట్ డిజైర్ కారులో గంజాయి రవాణా చేస్తున్నారనే సమాచారంతో శుక్రవారం రాత్రి నిజామాబాద్ సిటీ శివారు మాధవ్‌నగర్ లో ఎక్సైజ్ సీఐ స్వప్న, కానిస్టేబుళ్లతో కలిసి తనిఖీలు చేపట్టారు. కారు రోడ్డుపై వస్తుండగా ఆపేందుకు సీఐ, కానిస్టేబుళ్లు ముందుకెళ్లారు.
మహిళా కానిస్టేబుల్గాజుల సౌమ్య (24), కారును ఆపడానికి యత్నించగా, ఆమెపై ఎక్కించి వెళ్లి, చెట్టును ఢీకొని ఆగిపోయారు. అప్పటికే స్మగ్లింగ్ ముఠా సభ్యులు మహ్మద్ సోఫిఉద్దీన్, సయ్యద్సోయల్గంజాయిని సప్లై చేసేశారు.
నిందితుల నుంచి 2 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మోస్రాకు చెందిన సౌమ్య 2024లో ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. ప్రమాదంలో ఆమెకు తీవ్రగాయాలైన పక్కటెముకలు విరిగాయి. కండీషన్ సీరియస్‌గా ఉండడంతో హైదరాబాద్తరలించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆస్పత్రికి సౌమ్యను పరామర్శించి డాక్టర్లతో మాట్లాడారు. ప్రభుత్వ ఖర్చుతో ఆమెకు ట్రీట్ మెంట్ చేయిస్తామని కలెక్టర్ తెలిపారు.
