ఇంజనీర్లపై జీహెచ్ఎంసీ కమిషనర్ కొరడా

ఇంజనీర్లపై జీహెచ్ఎంసీ కమిషనర్ కొరడా

హైదరాబాద్: ఎస్ఎన్డీపీ  పనుల తీరును పరిశీలించేందుకు జూన్ 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జీహెచ్ఎంసీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, రాత్రి పూట కనిపించే విదంగా రేడియం బోర్డుల ఏర్పాటు, నాలాల పూడిక తీతకు సంబంధించిన పనుల్లో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తనిఖీ అధికారులు గుర్తించారు. వారి సిఫారస్ మేరకు జీహెచ్ఎంసీ పరిధిలోని 14 డివిజన్లలో పని చేస్తున్న మొత్తం 38 మంది ఇంజనీర్లపై కమిషనర్ యాక్షన్ తీసుకున్నారు. సికింద్రాబాద్  జోన్ లో పరిధిలో 9 మంది, శేర్ లింగంపల్లి జోన్ లోని 8, చార్మినార్ జోన్ లో 9, కూకట్పల్లి జోన్ లో 6, ఎల్బీనగర్ జోన్ లో2, ఖైరతాబాద్ జోన్ లో 4 మంది ఇంజనీర్ల ఒక్క రోజు వేతనంలో కమిషనర్ కోత విధించారు. విధులు నిర్వహించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ లోకేశ్ కుమార్ హెచ్చరించారు.