అక్టోబర్ 5న వస్తున్న 'ది ఘోస్ట్'

అక్టోబర్ 5న వస్తున్న 'ది ఘోస్ట్'

టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున తాజాగా 'ది ఘోస్ట్' మూవీలో నటిస్తున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై.లి బ్యానర్స్ పై పుష్కర్ రామ్మోహనరావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తోంది. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ విశేష స్పందన తెచ్చుకుంది. అక్టోబర్ 5న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో కిల్లింగ్ మెషిన్ పేరుతో మేకర్స్ ప్రమోషన్లను ప్రారంభించారు. ఈ మేరకు తాజా వీడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో నాగ్ రెండు చేతుల్లో రెండు పెద్ద కత్తులు పట్టుకొని శత్రువును తెగనరకడం మనం చూడొచ్చు. ఫార్మల్ సూట్ లో కింగ్ చాలా క్రూరంగా కనిపిస్తున్నాడు. ఘోస్ట్ కిల్లింగ్ మెషిన్ వీడియో నాగ్ కోపాన్ని ప్రదర్శిస్తుంది. ఈ సినిమాలో నాగార్జున ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. కాగా, ఒక యాక్షన్ ఎపిసోడ్ మినహా దాదాపు ఈ సినిమా పూర్తి కావచ్చింది.