ది గర్ల్‌‌‌‌ ఫ్రెండ్‌.. ట్రైలర్ ఎప్పుడంటే..

ది గర్ల్‌‌‌‌ ఫ్రెండ్‌.. ట్రైలర్ ఎప్పుడంటే..

రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి జంటగా రూపొందిన  చిత్రం ‘ది గర్ల్‌‌‌‌ ఫ్రెండ్‌‌‌‌’.  నటుడు రాహుల్‌‌‌‌ రవీంద్రన్‌‌‌‌ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు.  అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మిస్తున్నారు. 

నవంబర్ 7న వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా ఐదు భాషల్లో సినిమా విడుదల కానుంది. తాజాగా ట్రైలర్‌‌‌‌‌‌‌‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్. అక్టోబర్ 25న ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా రష్మిక, దీక్షిత్ కలిసున్న పోస్టర్ రిలీజ్ చేయడం ఆకట్టుకుంది.   

సరికొత్త ప్రేమకథగా దీన్ని తెరకెక్కిస్తున్నట్టు చెప్పడంతో ఈ ట్రైలర్‌‌‌‌‌‌‌‌పై క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే విడుదలైన  సాంగ్స్‌‌‌‌, టీజర్‌‌‌‌‌‌‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నాడు.