TheGirlFriend: ట్రెండింగ్లో రష్మిక రొమాంటిక్ మెలోడీ.. మనసుకు హత్తుకునే ‘నదివే’ లిరిక్స్ ఇవే

TheGirlFriend: ట్రెండింగ్లో రష్మిక రొమాంటిక్ మెలోడీ.. మనసుకు హత్తుకునే ‘నదివే’ లిరిక్స్ ఇవే

రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి జంటగా రూపొందుతున్న చిత్రం ‘ది గర్ల్‌‌ ఫ్రెండ్‌‌’.ఓ అందమైన ప్రేమకథగా నటుడు రాహుల్‌‌ రవీంద్రన్‌‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మిస్తున్నారు.

బుధవారం (జులై 16న) ఈ చిత్రం నుంచి ‘నదివే..’అనే పాటను విడుదల చేశారు. ఈ మెలోడీ సాంగ్‌‌ను హేషమ్ అబ్దుల్ వాహాబ్‌‌ కంపోజ్ చేయడంతో పాటు పాడాడు. ‘నదివే నువ్వు నదివే.. నీ మార్పే రానుంది వినవే... నదివే నువ్వు నదివే.. నీకే నువ్వియాలి విలువే..’అంటూ రాకేందు మౌళి రాసిన సాహిత్యం ఆకట్టుకుంది.

ఇక రష్మిక,  దీక్షిత్ శెట్టి జంటపై బ్యాలే డ్యాన్స్‌‌ తరహాలో పోయిటిక్‌‌గా ఈ పాటను చిత్రీకరించిన విధానం ఆకట్టుకుంది. విశ్వకిరణ్ నంబీ కొరియోగ్రఫీ, సిద్దార్థ్ నూని సినిమాటోగ్రఫీ ఇంప్రెస్ చేశాయి. ఇపుడీ రొమాంటిక్ మెలోడీ యూట్యూబ్లో మంచి వ్యూస్ రాబడుతోంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో సైతం షార్ట్ వీడియోస్ దూసుకెళ్తోంది.

లేటెస్ట్గా (జులై 17న) మేకర్స్ నదివే సాంగ్ వ్యూస్ కౌంట్ షేర్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘మనసుకు హత్తుకునే సాహిత్యంతో సాగేలా ఈ పాట హృదయాలను గెలుచుకుంటుంది. అది ఇంకా చాలా దూరం ప్రతిధ్వనిస్తుంది. #ది ది గర్ల్‌ఫ్రెండ్ ఫస్ట్ సింగిల్ మ్యూజిక్ వీడియో YouTubeలో 3.5 మిలియన్లకు పైగా వ్యూస్తో ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పటికీ లెక్కింపులో ఉంది’ అని మేకర్స్ వెల్లడించారు.

రష్మిక డ్యాన్స్కు తమ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రేయసి ప్రత్యేకతను పొగుడుతూ పొయెటిక్‌గా, రొమాంటిక్‌గా మనసుకు హత్తుకునేలా లిరిక్స్ అందించిన రాకేందు మౌళి శైలిని సైతం నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 5 విడుదల అయ్యే అవకాశం ఉంది.

‘నదివే’లిరిక్స్:

వెలుగారునా.. నిశిపూసినా..

వెలివేసినా.. మది వీడునా..

గుండె కన్నుమూసిన విధి రాసిన కల కాలిపోవు నిజమైన

నిన్ను వదలకుమా వదలకుమా.. బెదురెరుగని బలమా..

నదివే.. నువ్వు నదివే..

నీ మార్పే రానుంది వినవే..

నదివే.. నువ్వు నదివే..

నీకే నువ్వియ్యాలి విలువే..

సిలువ బరువేమోయకా..

సులువు భవి తెలీదుగా..

వెన్నెల వలదను కలువవు నువ్వు కావా.. కాలేవా..

ఓహో హో.. తడువు గురుతులై ఇలా..

తరుము గతమునావనా..

ఎటు కదలనీ నిమిషం నులిమిన గొంతుకవా

నటనిక చాలనే.. ఎద మోసినా కొన ఊపిరున్న చైతన్యం

నువ్వు వదలకుమా వదలకుమా.. సరికోరే నిజమా..

నదివే.. నువ్వు నదివే..

నీ మార్పే రానుంది వినవే..

నదివే.. నువ్వు నదివే..

నీకే నువ్వియ్యాలి విలువే..

మునుముందే వెలుగుంది నిన్నల్లో నిశి దాగున్న

మునుముందే వెలుగుంది దారే ముసుగుపోతున్న

మునుముందే వెలుగుంది ఆగద్దు ఏదేమైనా

మునుముందే వెలుగుంది దాటై ఆటు పోటైనా

మునుముందే వెలుగుంది కలలే విడొద్దంటున్న

మునుముందే వెలుగుంది తెలుపేగా హరివిల్లైనా

మునుముందే వెలుగుంది ఉనికిని మరువద్దంటున్న

మునుముందే వెలుగుంది నీ వెలుగై నేనొస్తున్నా..