రేబిస్ రహిత తెలంగాణే లక్ష్యం ..బ్లూ క్రాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యవస్థాపకురాలు అమల అక్కినేని

రేబిస్ రహిత తెలంగాణే లక్ష్యం ..బ్లూ క్రాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యవస్థాపకురాలు అమల అక్కినేని
  • రహమత్ నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉచిత యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ డ్రైవ్

జూబ్లీహిల్స్, వెలుగు: రేబిస్ రహిత తెలంగాణ లక్ష్యంగా జంతు సంరక్షణ, ప్రజారోగ్యంపై అవగాహన కల్పించే కార్యక్రమాలను విస్తృతం చేయాలని జంతు ప్రేమికురాలు, బ్లూ క్రాస్ సంస్థ వ్యవస్థాపకురాలు అమల అక్కినేని అన్నారు. 

బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్, మిషన్ రేబిస్ ఆధ్వర్యంలో సోమవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్ డివిజన్ ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఆర్ హిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉచిత యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆమె ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జంతువుల పట్ల ప్రేమ, కరుణతో  వ్యవహరించాలని, అదే సమయంలో ప్రజల భద్రతను కాపాడుకోవాలన్నారు. రేబిస్ వంటి ప్రాణాంతక వ్యాధిని నియంత్రించేందుకు ప్రజలు, జంతు సంరక్షణ సంస్థలు, స్థానిక సంస్థలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. 

రేబిస్ వ్యాప్తిని అరికట్టడంలో కుక్కలకు సకాలంలో వ్యాక్సినేషన్ చేయడం కీలకమన్నారు. మాజీ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, నిర్వాహకుడు రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తదితరులు పాల్గొన్నారు.