భూ సమస్యలున్న రైతులకు తప్పని తిప్పలు

 భూ సమస్యలున్న రైతులకు తప్పని తిప్పలు

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. నెల రోజులు దా టినా వాటి సంగతి ప్రస్తావించడం లేదు. వర్షాల సాకుతో వాయిదా వేసిన సదస్సులకు ఇప్పటి వరకు రివైజ్డ్ షెడ్యూల్ ప్రకటించలేదు. భూ సమస్యలు ఎదుర్కొంటున్న రైతులు ఎదురు చూస్తున్నారు. జులై 15 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని కేసీఆర్ అదే నెల 5న  ప్రకటించారు. ఒక్కో మండల కేంద్రంలో వంద బృందాలు ఏర్పాటు చేసి, ఎమ్మెల్యేల నేతృత్వంలో సదస్సులు నిర్వహిస్తామని ప్రకటించారు. సదస్సుల కన్నా ముందు ధరణి సమస్యలపై జులై 11న కలెక్టర్ల తో నిర్వహించాల్సిన మీటింగ్​తో పాటు రెవెన్యూ సదస్సులను వర్షాల కారణంగా వాయిదా వేశారు. ప్రస్తుతం వర్షాలు తగ్గి, వాతావరణం చక్కబడినా రెవెన్యూ సదస్సులు షెడ్యూల్ ప్రకటించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

సదస్సులు ఇగ లేనట్లేనా ? 

వాస్తవానికి రెవెన్యూ సదస్సులపై నిర్ణయం తీసుకునేనాటికి రాష్ట్రంలో రోజుకో చోట పోడు భూముల సమస్యలపై ఆందోళనలు జరగుతుండడం, ఫారె స్ట్ అధికారుల దాడులు పెరగడం, ధరణి సమస్యలపై రైతులు రోడ్డెక్కడం వంటి ఘటనలు జరిగాయి. మండల కేంద్రాల్లో సదస్సులు నిర్వహిస్తే రెండు, మూడు వేల మంది బాధితులు వచ్చే చాన్స్​ ఉంది.  వారు ఆందోళనలకు దిగితే ఇబ్బందులు తప్పవని ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు తెలిసింది. ఈ కారణాలతోనే ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను వాయిదా వేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ సొంత నియోజకవర్గంలో భూ సమస్యల పరిష్కారం కోసం పైలట్ గ్రామంగా ఎంపిక చేసిన ములుగులోనే 132 అప్లికేషన్లు ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోలేదు. ఇలాంటి అప్లికేషన్లు రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షలకు పైగా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే 8.13 లక్షల సాదాబైనామా దరఖాస్తులు, 3.4 లక్షల పోడు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. చట్ట సవరణ చేయకపోవడంతో వీటికే ఇప్పటి వరకు పరిష్కారం దొరకలేదు.

రెవెన్యూ సదస్సుల షెడ్యూల్ ప్రకటించాలి

ఒక్కో రెవెన్యూ గ్రామంలో 250కి పైగా భూ సమస్యలు ఉన్నాయి. కేసీఆర్ సొంత నియోజక వర్గంలోని పైలట్ విలేజ్ ములుగులోనే దారుణంగా ఉంది. దిద్దు బాటు చర్యల కోసం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని ప్రకటించారు. తమ సమ స్యలు ఇక పరిష్కారమవుతా యని సంతో షించారు. వర్షాల సాకుతో వాయిదా వేయడంతో నిరాశకు లోనయ్యారు. ఇప్ప టికైనా సదస్సుల షెడ్యూల్ ప్రకటించాలి. 
- మన్నె నర్సింహారెడ్డి, కన్వీనర్, ధరణి సమస్యల వేదిక