40 మందికి స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డులు

40 మందికి స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డులు

విద్యాశాఖ సెక్రటరీ కరుణ వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర బెస్ట్ టీచర్ అవార్డు జాబితాను సర్కారు  ప్రకటించింది. స్కూల్ ఎడ్యుకేషన్​పరిధిలో 40 మందిని అవార్డుకు ఎంపిక చేయగా, మరో 10 మందికి స్పెషల్ అవార్డులు ఇవ్వనున్నట్లు తెలిపింది. హెడ్మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు, డైట్ లెక్చరర్లు, స్పెషల్ కేటగిరీ కింద అవార్డులు ప్రదానం చేయనున్నారు. గురువారం విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులిచ్చారు.  హెడ్మాస్టర్లు/ప్రిన్సిపల్ కేటగిరీలో 17 నామినేషన్లు రాగా10 మందిని, స్కూల్ అసిస్టెంట్/పీజీటీలో 38 నామినేషన్లు వస్తే 19 మందిని, ఎస్జీటీ/టీజీటీ కేటగిరీలో 25 నామినేషన్లు వస్తే 10 మందిని.. లెక్చరర్లు/ సీనియర్ లెక్చరర్ల కేటగిరీలో ఒక నోటిఫికేషన్ రాగా వారిని సెలెక్ట్ చేశారు. ఎంపికైన టీచర్లందరికీ ఈ నెల 5న జరిగే టీచర్స్ డే సందర్భంగా అవార్డు, క్యాష్ ఫ్రైజ్ అందిస్తారు.

హెడ్మాస్టర్లు/ప్రిన్సిపల్ కేటగిరీలో అవార్డులు 
డాక్టర్ చకినాల శ్రీనివాస్, జీహెచ్ఎం, జీహెచ్ఎస్ సిరిసిల్లా– రాజన్న సిరిసిల్ల జిల్లా
బూస జమునాదేవి, జీహెచ్ఎం, జ‌‌‌‌‌‌‌‌డ్పీహెచ్ఎస్ తిర్మలాపురం– జగిత్యాల‌‌‌‌‌‌‌‌
ఓ.చంద్రశేఖర్, జీహెచ్ఎం, జ‌‌‌‌‌‌‌‌డ్పీహెచ్ఎస్ జూక‌‌‌‌‌‌‌‌ల్–భూపాల‌‌‌‌‌‌‌‌ప‌‌‌‌‌‌‌‌ల్లి
గోపాల్ సింగ్, జీహెచ్ఎం, జ‌‌‌‌‌‌‌‌డ్పీహెచ్ఎస్ ఇంద్రవ‌‌‌‌‌‌‌‌ల్లి–ఆదిలాబాద్
ముర‌‌‌‌‌‌‌‌ళీ కృష్ణమూర్తి, జీహెచ్ఎం, జ‌‌‌‌‌‌‌‌డ్పీహెచ్ఎస్ కౌకూరు– మేడ్చల్
ఎస్. సురేశ్‌‌‌‌‌‌‌‌, జీహెచ్ఎం, జడ్పీహెచ్ఎస్ పచ్చల న‌‌‌‌‌‌‌‌డ్కుడ‌‌‌‌‌‌‌‌–నిజామాబాద్
వి.రాజేంద‌‌‌‌‌‌‌‌ర్, జీహెచ్ఎం, జడ్పీహెచ్​ఎస్ గ‌‌‌‌‌‌‌‌నుగుప‌‌‌‌‌‌‌‌హాడ్ – జ‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌గామ‌‌‌‌‌‌‌‌
బి.చ‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌ప‌‌‌‌‌‌‌‌తిరావు, జీహెచ్ఎం, జ‌‌‌‌‌‌‌‌డ్పీహెచ్ఎస్ ముష్టికుంట్ల–ఖ‌‌‌‌‌‌‌‌మ్మం
వనుప‌‌‌‌‌‌‌‌లి నిరంజ‌‌‌‌‌‌‌‌న్, జీహెచ్ఎం, జ‌‌‌‌‌‌‌‌డ్పీహెచ్ఎస్ మ‌‌‌‌‌‌‌‌ణికొండ‌‌‌‌‌‌‌‌– రంగారెడ్డి
స‌‌‌‌‌‌‌‌తీశ్ కుమార్, ప్రిన్సిప‌‌‌‌‌‌‌‌ల్– సర్వేల్ గురుకులం–యాదాద్రి భువ‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌గిరి జిల్లా తదితరులున్నారు.