మరో 3,334 ఖాళీల భర్తీకి ఓకే

మరో 3,334 ఖాళీల భర్తీకి ఓకే

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో మరో 3,334 ఉద్యోగాల భర్తీకి సర్కారు గ్రీన్‌‌ సిగ్నల్‌‌ ఇచ్చింది. వీటి భర్తీకి అనుమతులు ఇస్తూ ఆర్థిక శాఖ బుధవారం జీవోలు జారీ చేసింది. ఆర్థిక శాఖ ఇప్పటికే తొలి విడతగా 30,423 ఖాళీల భర్తీకి అనుమతులు ఇచ్చింది. తాజాగా ఫైర్ సర్వీస్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, బేవరేజెస్‌‌ కార్పొరేషన్‌‌, అటవీ శాఖల్లోని ఖాళీల భర్తీకి ఓకే చెప్పింది. తెలంగాణ బేవరేజెస్‌‌ కార్పొరేషన్‌‌లో 40, ఎక్సైజ్‌‌ శాఖలో 751, అటవీ శాఖలో1,668, డిజాస్టర్‌‌ రెస్పాన్స్‌‌, ఫైర్‌‌ సర్వీసెస్‌‌లో 875 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. మిగతా శాఖల్లోని ఖాళీల భర్తీ విషయంపై కసరత్తు కొనసాగిస్తోంది. రాష్ట్రంలో 80,039 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని ఇటీవల అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌‌ ప్రకటించారు. అందులో భాగంగా విడతలవారీగా ఖాళీల భర్తీకి క్లియరెన్స్‌‌ ఇస్తున్నారు.   

బేవరేజెస్‌‌ కార్పొరేషన్‌‌ (40): 4 అకౌంట్స్‌‌ ఆఫీసర్‌‌, 7 అసిస్టెంట్‌‌ అకౌంట్స్‌‌ ఆఫీసర్‌‌ గ్రేడ్‌‌–2, 9 అసిస్టెంట్‌‌ మేనేజర్‌‌, 8 అసిస్టెంట్‌‌ స్టోర్‌‌ మేనేజర్‌‌ గ్రేడ్‌‌–2, 8 డేటా ప్రాసెసింగ్‌‌ అసిస్టెంట్ గ్రేడ్‌‌–2, 3 డేటా ప్రాసెసింగ్‌‌ ఆఫీసర్‌‌. ప్రొహిబిషన్‌‌ అండ్‌‌ ఎక్సైజ్‌‌ (751): 8 అసిస్టెంట్‌‌ కెమికల్‌‌ ఎగ్జామినర్‌‌, 114 జూనియర్‌‌ అసిస్టెంట్‌‌(లోకల్), 15 జూనియర్‌‌ అసిస్టెంట్‌‌ (స్టేట్‌‌), 614 ఎక్సైజ్‌‌ కానిస్టేబుల్. అటవీ శాఖ (1,668): 1,393 ఫారెస్ట్‌‌ బీట్‌‌ ఆఫీసర్‌‌, 92 ఫారెస్ట్‌‌ సెక్షన్‌‌ ఆఫీసర్‌‌, 32 టెక్నికల్‌‌ అసిస్టెంట్‌‌, 9 జూనియర్ అటెండెంట్‌‌, 18 అసిస్టెంట్‌‌ కన్జర్వేటర్‌‌ ఆఫ్‌‌ ఫార్టెస్ట్స్‌‌, 73 జూనియర్‌‌ అసిస్టెంట్‌‌(ఎల్‌‌సీ), 2 జూనియర్‌‌ అసిస్టెంట్‌‌ (హెచ్‌‌వో), 21 అసిస్టెంట్‌‌ ప్రొఫెసర్‌‌, 4 అసోసియేట్‌‌ ప్రొఫెసర్‌‌, 2 ఫిజికల్‌‌ ఎడ్యుకేషన్‌‌ టీచర్‌‌, 2 ప్రొఫెసర్‌‌, ఒక్కోటి చొప్పున అసిస్టెంట్‌‌ కేర్‌‌ టేకర్‌‌, అసిస్టెంట్‌‌ లైబ్రేరియన్‌‌, కేర్‌‌ టేకర్‌‌, లైబ్రేరియన్‌‌, స్టోర్స్‌‌ అండ్‌‌ ఎక్విప్‌‌మెంట్‌‌ మేనేజర్‌‌.డిజాస్టర్‌‌ రెస్పాన్స్‌‌ అండ్‌‌ ఫైర్‌‌ సర్వీసెస్‌‌ (875): 14 జూనియర్‌‌ అసిస్టెంట్‌‌ (హెచ్‌‌వో), 26 స్టేషన్‌‌ ఫైర్‌‌ ఆఫీసర్‌‌, 610 ఫైర్‌‌మెన్‌‌, 225 డ్రైవర్‌‌ ఆపరేట్‌‌.