
‘కోర్ట్’ సినిమాతో ఆకట్టుకున్న రోషన్, శ్రీదేవి జంట మరోసారి కలిసి నటిస్తున్నారు. వీళ్లిద్దరితో దర్శకుడు సతీష్ జవ్వాజీ ‘బ్యాండ్ మేళం’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ‘ఎవ్రీ బీట్ హ్యాజ్ యాన్ ఎమోషన్’ అనేది ట్యాగ్‌లైన్. కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై కావ్య, శ్రావ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
బుధవారం (సెప్టెంబర్ 17న) ‘ఫస్ట్ బీట్’ పేరుతో టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. తెలంగాణ జానపద శైలిలో వినిపిస్తున్న పాటతో టీజర్ మొదలైంది. రాజమ్మా అంటూ శ్రీదేవి కోసం ఇల్లంతా వెతికిచూసి మేడపైకి వెళ్లాడు రోషన్. నీ కోసం ఓ కొత్త ట్యూన్ చేశా..ఈ యాదగిరి వాయిస్తే భువనగిరి దాకా వినిపిస్తది అంటూ మౌత్ పియానోపై ఓ పాటను వినిపించడంతో టీజర్ ముగిసింది.
►ALSO READ | Rajinikanth: కమల్తో మూవీ కన్ఫమ్ చేసిన రజనీ.. డైరెక్టర్ లోకేష్ మారబోతున్నాడా? తలైవా ఏం చెప్పాడంటే..
తెలంగాణ నేటివిటీ.. రోషన్ శ్రీదేవి జంట కెమిస్ట్రీ, విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ ఆకట్టుకున్నాయి. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే మ్యూజికల్ లవ్ స్టోరీ ఇదని అర్థమవుతోంది. సాయికుమార్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత చంద్రబోస్ సాహిత్యం అందిస్తున్నారు.