
నలభై ఆరేళ్ల తర్వాత రజినీకాంత్, కమల్ హాసన్ కలిసి ఓ చిత్రంలో నటించబోతున్నారు. ఈ విషయాన్ని ఇటీవల కమల్ హాసన్ రివీల్ చేయగా, తాజాగా రజినీకాంత్ కూడా కన్ఫర్మ్ చేశారు.
బుధవారం (సెప్టెంబర్ 17న) చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో మీడియాతో ముచ్చటించిన ఆయన.. తన నెక్స్ట్ మూవీ గురించి క్లారిటీ ఇచ్చారు. తన తదుపరి చిత్రాన్ని కమల్‌కు చెందిన రాజ్ కమల్ ఇంటర్నేషనల్, ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జాయింట్ సంస్థలు కలిసి నిర్మించబోతున్నాయని చెప్పారు.
తాను, కమల్ కలిసి నటించాలని ఆశపడుతున్నామని, కానీ అందుకు తగ్గ కథ, కథనాలు కుదరాల్సి ఉందని చెప్పారు. ఇప్పటికైతే ఈ ప్రాజెక్ట్‌పై ఎలాంటి అప్‌డేట్స్ లేవని... స్టోరీ, డైరెక్టర్ ఖరారు అయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో ఈ మల్టీస్టారర్ ఉండబోతోందని పెద్ద ఎత్తున ప్రచారం ఉంది. కానీ రజనీకాంత్ తాజా కామెంట్స్‌తో దర్శకుడు ఇంకా ఫైనల్ అవలేదని క్లారిటీ వచ్చింది.
►ALSO READ | Bhadrakaali Bookings: ‘భద్రకాళి’ బుకింగ్స్ ఓపెన్..
కమల్‌తో లోకేష్ తీసిన ‘విక్రమ్’ మెప్పించినప్పటికీ, రజినీకాంత్‌తో తీసిన ‘కూలీ’ కంటెంట్, క్యారెక్టరైజేషన్స్ పరంగా నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో తమ ఇద్దరి ఇమేజ్‌కు తగ్గ కథ కుదిరితేనే ముందుకెళ్లాలనే ప్లాన్‌లో ఉన్నారు ఈ ఇద్దరు కోలీవుడ్ స్టార్స్. మరి లోకేష్ డైరెక్షన్‌లో ఉంటుందా, దర్శకుడు మారబోతున్నాడా అనేది వేచిచూడాలి!
Marking half a century of cinematic brilliance, my dear friend @rajinikanth celebrates 50 glorious years in cinema today. I celebrate our Super Star with affection and admiration, and wish #Coolie resounding global success befitting this golden jubilee.
— Kamal Haasan (@ikamalhaasan) August 13, 2025
Helmed by the powerhouse… pic.twitter.com/FrU5ytphoL