
విజయ్ ఆంటోనీ నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ ‘భద్రకాళి’ (Bhadrakaali). అరుణ్ ప్రభు దర్శకుడు. విజయ్ ఆంటోని సమర్పణలో రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్, రాణా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నాయి. రేపు శుక్రవారం (సెప్టెంబర్ 19న) తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలవుతోంది.
ఈ సందర్భంగా ఇవాళ (సెప్టెంబర్ 18న) ‘భద్రకాళి’ బుకింగ్స్ ఓపెన్ చేశారు మేకర్స్. ‘‘థ్రిల్ ఇవ్వడానికి విజయ్ ఆంటోనీ సిద్ధంగా ఉన్నారు. ఆడియన్స్ మీరు ఉన్నారా? భద్రకాళి బుకింగ్‌లు ఇప్పుడే ప్రారంభమయ్యాయి! రేపు శుక్రవారం సెప్టెంబర్ 19న బిగ్ స్క్రీన్ ‘భద్రకాళి’ కాలింగ్!’’ అని మేకర్స్ తెలిపారు.
Vijay Antony is ready. Are you? 😎
— Spirit Media (@SpiritMediaIN) September 18, 2025
Bookings OPEN NOW for #Bhadrakaali!
🎟️ Don’t wait. SEPT 19th – Big Screen Calling!
👉 Book here: https://t.co/c9DpphGbHA@vijayantony @ArunPrabu_ @TruptiRavi58094 @ririjithu
#SunilKirpalani @vijayantonyfilm #RamanjaneyuluJavvaji… pic.twitter.com/6kBQSmdLTs
ఈ క్రమంలో మూవీ రిలీజ్ సందర్భంగా విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ.. ‘‘నా కెరీర్‌లో ఇది 25వ సినిమా. స్టోరీ, స్కేల్ పరంగా నా కెరీర్‌లో ఇది బిగ్గెస్ట్ మూవీ. ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలో సాగే పొలిటికల్ థ్రిల్లర్. పాలిటిక్స్‌ను ఇందులో చాలా నేచురల్‌గా చూపించాం. నేనొక పొలిటికల్ మీడియేటర్‌గా కనిపిస్తా. ఓ పెద్ద స్కాంలో అతని పాత్ర ఏమిటి అనేది ప్రేక్షకులకు న్యూ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. ఇలాంటి పొలిటికల్ బ్రోకర్ క్యారెక్టర్‌తో సినిమాలు రాలేదు.
►ALSO READ | OG Ticket Price: ‘ఓజీ’ బెనిఫిట్ షో టికెట్ రూ.1000లు..
దర్శకుడు అరుణ్ ప్రభు అద్భుతమైన కథను రాశారు. ఇందులోని ప్రతి ఎలిమెంట్ రియలిస్టిక్‌గా ఉంటుంది. రొటీన్ పొలిటికల్ సినిమాలా కాకుండా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. నిర్మాత రామాంజనేయులు, సురేష్ ప్రొడక్షన్స్‌తో మరోసారి కొలాబరేట్ అవుతా. వారు ఈ సినిమాని గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ‘బిచ్చగాడు’ డైరెక్టర్‌తో ‘వంద దేవుళ్ళు’ అనే సినిమా చేస్తున్నా” అని విజయ్ ఆంటోనీ చెప్పాడు.
ఇటీవలే రిలీజ్ చేసిన ‘భద్రకాళి’ ట్రైలర్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. మూడు నిమిషాల పాటు సాగిన ఈ ట్రైలర్, ఉత్కంఠ కలిగించే అంశాలతో అంచనాలు పెంచేసింది. ఈ సినిమాకు విజయ్ ఆంటోని సంగీతాన్ని కూడా అందిస్తున్నారు. వాగై చంద్రశేఖర్, సునీల్ కృపలానీ, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, మాస్టర్ కేశవ్ ఈ మూవీలో కీలక పాత్రలను పోషిస్తున్నారు.