సగం బెడ్ల ముచ్చట ఒడిసినట్టే!

సగం బెడ్ల ముచ్చట ఒడిసినట్టే!
  • ప్రభుత్వ ప్రతిపాదనకు నో చెప్పిన కార్పొరేట్‌ హాస్పిటల్స్
  •  స్పందించని సర్కార్ పెద్దలు
  • గవర్నమెంట్ హాస్పిటల్స్లో బెడ్లునిండినంకనే తీసుకుంటామంటున్న హెల్త్ ఆఫీసర్లు
  •  ప్రైవేటు టీచింగ్ హాస్పిటళ్లలో ఒక్కరికీ అందని కరోనా ఫ్రీ ట్రీట్మెంట్

సర్కార్‌‌‌‌చెప్పిన సగం బెడ్ల ఫార్ములా అటకెక్కింది. ఒక్కబెడ్డుకూడా ఇచ్చేది లేదని కార్పొరేట్, ప్రైవేటు హాస్పిటల్స్మేనేజ్మెంట్లుప్రభుత్వానికి స్పష్టం చే సినట్టుతెలిసింది. దీంతో ప్రజలను మభ్యపెట్టడాని కి సర్కార్ మరో కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. ప్ర భుత్వ దవాఖాన్లలోని బెడ్లు పూర్తిగా నిండిన తర్వాతే, ప్రైవేట్‌‌లో సగం బెడ్లు తీసుకుంటామం టూ హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫీసరతో ప్రకటనలు ్ల చేయిస్తున్నది. మరోపక్క, కరోనా పేషెంట్లను కా ర్పొరేట్ హాస్పిటళ్లు అడ్డగోలుగా దోచుకుంటున్నాయి. ఈ దోపిడీపై హెల్త్డిపార్ట్మెంట్కు సుమారు 1,450 ఫిర్యాదులు అందాయి. హైదరాబాద్‌లో ఉన్నదాదాపు అన్నిహాస్పిటళ్లకు నోటీసులు ఇచ్చినట్లు ఈ నెల 10న హెల్త్మినిస్టర్ ఈటల రాజేందర్ ప్రకటించారు.

కానీ, ఇప్పటికీ ఒక్క హాస్పిటల్ మీద కూడా చర్చలు తీసుకోలేదు. ఈ నెల13న కార్పొరేట్ హాస్పిటల్స్ మేనేజ్మెంట్లతో మంత్రి సమావేశం నిర్వహించి.. మేనేజ్మెంట్లు దిగొచ్చాయని, ప్రైవేటు హాస్పిట ళ్లలో సగం బెడ్లు ఇవ్వడానికి అంగీకరించాయని ప్రకటించారు. ఈ సగం బెడ్లలోకి ప్రభుత్వమే పేషెంట్లను పంపిస్తుందని, ప్రభుత్వం చెప్పిన ధరల ప్రకారమే చార్జీలు  ఉంటాయని ఆయన అన్నారు. ఒకట్రెండు రోజుల్లోనే గైడ్ లైన్స్ ఖరారు చేస్తామని చెప్పారు. ఆ మరుసటి రోజే కార్పొరేట్ హాస్పిటల్స్ మేనేజ్మెంట్లతో హెల్త్డిపార్మట్ మెంట్ ఆఫీసర్లు సమావేశమయ్యారు. సర్కార్‌‌కు ఇచ్చే సగం బెడ్లలో గరిష్టంగా 14 రోజులకు రూ. 4 లక్షలకు మించి చార్జ్‌ చేయొద్దని ప్రతిపాదించారు. ఇందుకు బదులుగా మిగిలిన సగం బెడ్లలో చేరేవారి చార్జీల  విషయంలో హాస్పిటల్స్ మేనేజ్మెంట్లకే పూర్తి స్వేచ్ఛ ఉంటుందనే సంకేతాలు ఇచ్చారు. ఈ ప్రతిపాదనల పై చర్చించుకుని నిర్ణయం చెబుతామన్నకార్పొరేట్ హాస్పిటల్స్మేనేజ్మెంట్లు.. ఇప్పటివరకూ వెనుదిరిగి చూడలేదు. 50 శాతం బెడ్లమాట అటుంచితే, కనీసం 50 బెడ్లు ఇచ్చేందుకు కూడా ఒప్పుకోలేదు. ప్రభుత్వ దవాఖాన్లలోని బెడ్లు పూర్తిగా నిండిన తర్వాతే, ప్రైవేట్‌లోని సగం బెడ్లు తీసుకుంటామంటూ మంగళవారం జరిగిన ప్రెస్‌ మీట్‌లో పబ్లిక్ హెల్త్ డైరెక్టర్  డాక్టర్ శ్రీనివాసరావు ప్రకటించారు. దీనిపై ఆరా తీయగా ప్రభుత్వ ప్రతిపాదనను కార్పొరేట్ యాజమాన్యాలు తిరస్కరించడంతోనే, ఈ కొత్త వాదనను తెరపైకి తెచ్చినట్టు తెలిసింది.

 ప్రైవేటు టీచింగ్ హాస్పిటళ్ల విషయంలోనూ ఇంతే

ప్రైవేట్ టీచింగ్ హాస్పిటళ్ల విషయంలోనూ సర్కార్ మాట మార్చింది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ టీచింగ్ హాస్పిటళ్లలో  కరోనా పేషెంట్లకు ఫ్రీగా ట్రీట్మెంట్ అందిస్తామని ఏప్రిల్‌లో మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. ఆ తర్వాత పలుమార్లు టీచింగ్ హాస్పిటళ్ల మేనేజ్మెంట్లతో సమావేశాలు నిర్వహించి, బెడ్లు ఇచ్చేందుకు ఒప్పుకున్నారని ప్రకటనలు జారీ చేశారు. జులై 1న గ్రేటర్‌‌లోని కామినేని, మల్లారె డ్డి, మమతా మెడికల్ కాలేజీలను మంత్రి ఈటల పరిశీలించారు. మరుసటి రోజు నుంచే వాటిల్లో కరోనా పేషెంట్లకు ట్రీట్మెంట్ అందించనున్నట్టు చెప్పారు. ఇప్పటివరకూ ఒక్క పేషెంట్‌కు కూడా ప్రైవేట్ టీచింగ్ హాస్పిటళలో ్ల ఫ్రీగా ట్రీట్మెంట్అం దించలేకపోయారు. కానీ, వాటిల్లో ఉన్న సుమారు 9 వేల బెడ్లు తమ ఆధీనంలోనే ఉన్నట్టుప్రభుత్వం చెప్పుకుంటోంది.