ఖరారు కానీ ఇంజినీరింగ్ ఫీజులు..ఆందోళనలో విద్యార్థులు

ఖరారు కానీ ఇంజినీరింగ్ ఫీజులు..ఆందోళనలో విద్యార్థులు

రేపటి నుండి ఎంసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రారంభంకానుండగా..ప్రభుత్వం ఇంతవరకు ఫీజులు ఖరారు చేయలేదు. దీంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫీజులపై మొదటి నుంచి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విద్యార్థుల తల్లితండ్రులు మండిపడుతున్నారు. ఫీజులపై నివేదిక ఇచ్చామని.. ప్రభుత్వం ఇంకా ఆమోదం తెలుపలేదని ఫీ రెగ్యులేటర్ కమిటీ అధికారులు చెబుతున్నారు.

ఇప్పటివరకు ఫీజులు ఖరారు కాకపోవడంతో రేపు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుందా ఉండదా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ప్రైవేట్ కాలేజీలకు లాభం చేకూర్చాలనే ప్రభుత్వం ఇంతవరకు ఫీజులు ఖరారు చేయలేదని టెక్నికల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆరోపించింది. ఫీజులు ఖరారు కాకుండా కౌన్సిలింగ్ ఎలా నిర్వహిస్తారని అసోసియేషన్ సభ్యులు ప్రశ్నించారు.