సబ్సిడీ బియ్యం నిధుల విడుదల

సబ్సిడీ బియ్యం నిధుల విడుదల

హైదరాబాద్‌‌, వెలుగు: ప్రభుత్వం బియ్యం సబ్సిడీలో రాష్ట్ర వాటా నిధులు రూ.564.15 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు సివిల్‌‌ సప్లయ్స్‌‌ కమిషనర్‌‌ అనిల్‌‌కుమార్‌‌ జీవో జారీ చేశారు. సవిల్‌‌ సప్లయ్స్‌‌ ద్వారా పంపిణీ చేసే బియ్యానికి సంబంధించిన సబ్సిడీ కోసం ప్రభుత్వం రూ.2,286.90 కోట్లు కేటాయించింది. ఇందులో ఇప్పటి వరకు రూ.1,722 కోట్లు విడుదల చేయగా, మిగిలిన రూ.564.15 కోట్లు తాజాగా రిలీజ్​చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కేంద్రం ఎఫ్‌‌సీఐ ద్వారా రూ.34కు కిలో చొప్పున బియ్యం సేకరిస్తోంది. ఇందులో కేంద్రం కిలోకు రూ.31 భరిస్తోంది. రాష్ట్రం రూ.2, వినియోగదారుడు కిలోకు ఒక రూపాయి చెల్లిస్తున్నాడు.