గురుకులాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది

గురుకులాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది

సత్తుపల్లి, వెలుగు : గురుకుల పాఠశాలలు, కళాశాలలపై రాష్ట్ర ప్రభుత్వం  ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ముజాహీద్ అన్నారు. శుక్రవారం స్థానిక మైనార్టీ గురుకుల కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. 

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కె.వెంకటరామయ్యను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కళాశాలలో ఏమైనా సమస్యలుంటే పరిశీలించి నివేదిక ఇవ్వాలన్నారు. కళాశాలలోని పలు రిజిస్ట్రర్లతో పాటు తరగతి గదులు, మరుగుదొడ్లు, కిచెన్, తాగునీటి ప్లాంట్, కళాశాల ఆవరణను ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సమయానికి సిలబస్‌ పూర్తి చేస్తున్నారా.. లేదా అని స్టూడెంట్స్​ను అడిగి తెలుసుకున్నారు.