
హైదరాబాద్, వెలుగు: షరతుల సాగులో భాగంగా యాసంగి లో 65.69 లక్షల ఎకరాల్లో పంటలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వరి 50 లక్షల ఎకరాలు, పప్పుశెనగ 4.50 లక్షలు, వేరుశనగ 4 లక్షల ఎకరాలు, జొన్న లక్ష ఎకరాలు, నువ్వులు లక్ష ఎకరాల్లో వేయాలని నిర్ణయించారు. ఇందుకోసం 17.68 లక్షల క్వింటాళ్ల విత్తనాలను అవసరమవుతాయని అంచనా వేశారు. అవసరం కంటే ఎక్కువగానే 22.11లక్షల క్వింటాళ్ల విత్తనాలను సరఫరాకు రెడీ చేశారు.