ప్రైవేటులో బెడ్లు ఖాళీగా ఉన్నాయన్న సర్కార్..లేవంటున్న హాస్పిటళ్లు

ప్రైవేటులో బెడ్లు ఖాళీగా ఉన్నాయన్న సర్కార్..లేవంటున్న హాస్పిటళ్లు
  • ప్రైవేటులో బెడ్లు ఖాళీగా ఉన్నాయట!
  • 1,465 అందుబాటులో ఉన్నట్లు బులెటిన్లో సర్కారు వెల్లడి
  • కానీ బెడ్లు లేవని పేషెంట్లను చేర్చుకోని ప్రైవేట్ హాస్పిటళ్లుప్ర
  • తొలిసారిగా కరోనాపై 59 పేజీల బులెటిన్
  • మంగళవారం ఉదయం 7 గంటలకే రిలీజ్
  • రాష్ట్రంలో 1,057 కంటెయిన్‌మెంట్ జోన్లు
  • కొత్తగా 1,610 మందికి కరోనా పాజిటివ్
హైదరాబాద్‌, వెలుగు: కరోనావిషయంలో హైకోర్టు ఘాటు కామెంట్లుచేయడంతో ఎట్టకేలకు రాష్ట్ర సర్కారు బులెటిన్‌ లో మార్పులు చేసింది. అదనపు వివరాలు జత చేసి మంగళవారం ఉదయం 7 గంటలకే ఏకంగా 59 పేజీల భారీ బులెటిన్ను విడుదల చేసింది. నిన్నమొన్నటి వరకూ పాజిటివ్ కేసులు,  మరణాల సంఖ్య, గవర్నమెంట్  దవాఖాన్లలో అందుబాటులో ఉన్న బెడ్ల వివరాలను మాత్రమే బులెటిన్లలో ప్రకటిస్తూ వచ్చారు. మంగళవారం తొలిసారిగా ప్రైవేటు హాస్పిటల్స్లో ఖాళీగా ఉన్న బెడ్లవివరాలు, జిల్లాల వారీగా కరోనా కేసులు ఎక్కువగా ఉన్న కంటెయిన్‌మెంట్‌ జోన్ల వివరాలను కూడా పొందుపర్చారు.   ఇప్పుడూ ఆరోగ్య శాఖ మళ్లీలెక్కల్లోకొన్ని తప్పులను చూపించింది. రాష్ట్రవ్యాప్తంగా 1,057 కంటైన్‌‌మెంట్ జోన్లుఉన్నాయని బులెటిన్‌‌లో పేర్కొంది. 30 వేలకుపైగా కేసులున్నగ్రేటర్‌‌‌‌హైదరాబాద్‌లో 92 కంటైన్‌‌మెంట్ జోన్లుఉన్నట్టుచూపింది. 580 కేసులే ఉన్న మహబూబ్‌నగర్‌‌‌‌లో ఏకంగా 192 కంటైన్‌‌మెంట్ జోన్లు ఉన్నట్టుపేర్కొంది. రంగారెడ్డి(నాన్‌‌జీహెచ్‌‌ఎంసీ)లో 165, సంగారెడ్డిలో 82, కరీంనగర్‌‌57, సిరిసిల్లలో 52, జగిత్యాల్‌‌లో 52 కంటైన్మెంట్జోన్లుఉన్నాయని తెలిపింది. దీంతో కంటైన్‌‌మెంట్ జోన్ అనేది ఏ ప్రాతిపదికన చేశారన్నది అర్థంకాని పరిస్థితి ఏర్పడింది.
బులెటిన్లో ఖాళీ.. హాస్పిటల్స్లో ఫుల్ 
రాష్ట్రంలోని 55 ప్రైవేటు హాస్పిటల్స్‌‌లో కరోనా ట్రీట్‌‌మెంట్‌‌అందిస్తున్నట్టుఆరోగ్య శాఖ బులెటిన్‌‌లో పేర్కొంది. ఈ 55 హాస్పిటల్స్‌‌లో కలిపి 4,497 బెడ్లు ఉంటే, అందులో సోమవారం రాత్రి 8 గంటల వరకూ 1,465 బెడ్లు ఖాళీగా ఉన్నట్టుచూపించింది. యశోద, కిమ్స్, అపోలో, ఏఐజీ, స్టార్‌‌‌‌ , సన్‌‌షైన్‌‌.. ఇలా అన్ని కార్పొరేట్‌‌హాస్పిటల్స్‌‌లోనూ బెడ్లు ఖాళీగా  ఉన్నట్టుతెలింది. కానీ, చాలా హాస్పిటల్స్‌‌బెడ్లు ఖాళీ లేవని మంగళవారం పేషెంట్లను తిరస్కరించాయి. ఉదాహరణకు జూబ్లీహిల్స్‌‌అపోలో హాస్పిటల్స్‌‌లో 30 ఆక్సిజన్ బెడ్లు, 45 ఐసీయూ బెడ్లుఖాళీగా ఉన్నాయని బులెటిన్‌‌లో పేర్కొన్నారు. మంగళవారం షేక్‌‌పేట్‌‌కు చెందిన సుధాకర్‌‌‌‌అనే వ్యక్లి అక్కడకు వెళ్తే, మరో 48 గంటల వరకూ బెడ్ దొరకడం కష్టమని హాస్పిటల్‌‌వర్గాలు తిప్పిపంపేశాయి. సికింద్రాబాద్‌యశోదాలో 46 సాధారణ బెడ్లు, 35 ఐసీయూ బెడ్లుఖాళీగా ఉన్నట్టుచూపించారు. ఆ హాస్పిటల్‌‌ప్రతినిధిని బెడ్‌కోసం ఫోన్‌‌లో సంప్రదించగా.. బెడ్లు ఖాళీ లేవన్న సమాధానమే వచ్చింది. చాలా హాస్పిటల్స్‌‌లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యం లో ఆరోగ్య శాఖ ప్రకటించినలెక్కలు తప్పా, బెడ్లు ఖాళీ ఉన్నా లేవని చెబుతూ హాస్పిటల్సేబ్లాక్ చేస్తున్నాయా అన్నది తెలియాల్సిఉంది.
ఇతర జబ్బులు లేకున్నా..
రాష్ట్రంలో సోమవారం రాత్రి 8 గంటల వరకూ 480 మంది కరోనాతో మరణించినట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో 53.87%(259) మంది ఇతర జబ్బులతో బాధపడుతూ కరోనా సోకి చనిపోయినట్టుపేర్కొంది. మిగిలిన 46.13%.. అంటే221 మంది కరోనా సోకడం వల్లే మరణించారని తెలిపింది. దేశవ్యాప్తంగా కోమార్బిడ్ మరణాలు 70 శాతం, ఇతర జబ్బులు లేకుండా చనిపోయిన వారు 30 శాతం ఉండగా, రాష్ట్రంలో మాత్రం ఇతరజబ్బులు లేకుండా చనిపోయిన వారు 44.63 శాతం ఉండడంఆందోళన కలిగిస్తోంది. ఇతర జబ్బులు లేనోళ్ళపై  కరోనా పెద్దగా ప్రభావం చూపకపోయినా, సరైన టైమ్లో ట్రీట్‌‌మెంట్ అందకపోతే ఎక్కువ ప్రమాదం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు.
కొత్త కేసులు 1,610
రాష్ట్రంలో ఆదివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం రాత్రి 8 గంటల వరకూ 24 గంటల్లో 1,610 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 531 కేసులు గ్రేటర్ హైదరాబాద్‌లో, మిగిలిన 1,079 కేసులు జిల్లాల్లో నమోదయ్యాయి. వరంగల్‌‌అర్బన్‌‌లో 152 కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 57,142కు పెరిగింది.ఇందులో 13,753 యాక్టివ్ యాక్టి కేసులు ఉండగా, మిగతా వారు కోలుకున్నట్టుచూపించారు. యాక్టివ్ యాక్టి కేసుల్లో 8,479 మంది హోంక్వారంటైన్‌‌లో ఉండగా, 2,242 మంది ప్రభుత్వ దవాఖాన్లలో, 3,032 మంది ప్రైవేటు హాస్పిటళలో ట్రీ ్ల ట్‌‌మెంట్ పొందుతున్నారు.
హైకోర్టు విచారణ నేపథ్యంలోనే!
కరోనాకు సంబంధ ించిన పిటిషన్ల పై మంగళవారం హైకోర్టు విచారణ జరిగింది. చీఫ్ సెక్రెటరీ సోమేశ్‌‌కు
మార్ సహా పలువురు ఉన్నతాధికారులు విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఎన్నడూ లేని విధంగా
ఉదయం 7కే పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ కరోనా బులెటిన్ విడుదల చేశారు. కేసులు, చావుల సంఖ్య మాత్రమే ఉండే బులెటిన్‌‌లో ప్రభుత్వ, ప్రైవేటు దవాఖాన్లలో బెడ్లు, కంటెయిన్‌‌మెంట్ జోన్లు, వయసుల వారీ పేషెంట్లవివరాలనూ ఇచ్చారు. మార్చి నుంచి రాత్రి పూట చేస్తున్న బులెటిన్‌‌ను, 3 రోజులుగా పొద్దున ఇస్తున్నారు. రాత్రి 10 తర్వాత, ఉదయం పదకొండు తర్వాత విడుదల చేసే బులెటిన్‌‌ను మంగళవారం పొద్దున 7 గంటలకే ఇచ్చారు. రోజూ ఇట్లే చేస్తారో, హైకోర్టు కండ్లు గప్పేందుకే ఇలా చేశారో వేచిచూస్తే కానీ తెలియదు.
ఇంకో 8,635 బెడ్లు ఏవి?
రాష్ట్రవ్యాప్తంగా 57 ప్రభుత్వ దవాఖాన్లలో కరోనా ట్రీట్‌‌మెంట్ అందిస్తున్నట్టుబులెటిన్‌‌లో ఆరోగ్య శాఖ తెలిపింది. ఇందులో 8,446 బెడ్లు న్నట్టుచూపింది. సోమవారం రాత్రి 8 వరకూ ఈ 57 దవాఖాన్లలో 2,242 మంది పేషెంట్లు ట్రీట్‌‌మెంట్‌‌పొందుతుండగా 6,204 బెడ్లు ఖాళీగా ఉన్నాయని తెలిపింది. అలాగే సర్కారు అధీనంలోని దవాఖాన్లలో 17,081 బెడ్లుఉన్నా యంది. 8,446 పోను మిగిలిన 8,635 బెడ్లు ఏమయ్యాయో చెప్పలేదు.
బెడ్లు లేవన్నరు
నేను షేక్ పేట్‌లో ఉంటా. మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్లో ఒకరికి కరోనా సోకింది. జూబ్లీ హిల్స్ అపోలోలో బెడ్ కోసం అడగమన్నారు.మంగళవారం సాయంత్రం అపోలో వెళ్లాను. కరోనా వార్డు దగ్గరకు వెళ్లి అడిగితే ఎమర్జెన్సీ లో అడగమన్నారు. అక్కడికెళ్లి అడిగితే.. మరో 48 గంటల వరకు బెడ్స్ ఖాళీ లేవని చెప్పారు.
-సుధాకర్, షేక్‌పేట1