రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ను అవమానించింది

రాష్ట్ర ప్రభుత్వం  గవర్నర్ను అవమానించింది

కేసీఆర్ సంస్కారహీనుడు: ఎమ్మెల్యే ఈటల రాజేందర్

హైదరాబాద్: గవర్నర్ మేడారం పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళిసై పర్యటనలో ప్రోటోకాల్ పాటించకుండా కేసీఆర్ సర్కారు అవమానించిందని మండి పడ్డారు. ఈ నెల 19న సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు గవర్నర్ తమిళిసై మేడారం వెళ్లగా ఆమెకు స్వాగతం పలికేందుకు  ఏ ఒక్క మంత్రి, జిల్లా కలెక్టర్, ఎస్పీ హాజరుకాలేదు. రాష్ట్ర ప్రథమ పౌరురాలి మేడారం పర్యటనలో అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని ఈటల తప్పుబట్టారు. ఈ అంశంపై సీఎం కేసీఆర్ ఇప్పటికీ స్పందించకపోవడం దురదృష్టకరమన్న ఆయన..ఇదంతా కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగిందన్న అనుమానం వ్యక్తం చేశారు. 

మేడారం పర్యటనలో గవర్నర్ ను అవమానించిన సీఎం కేసీఆర్ కు రాజ్యాంగ వ్యవస్థలపై గౌరవం లేదన్న విషయం మరోసారి స్పష్టమైందని ఈటల అన్నారు. పీఎం మోడీని కేసీఆర్ ఎన్ని మాటలన్నా.. కేసీఆర్ పుట్టిన రోజున మోడీ తనకు ఫోన్ చేసి విషెస్ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. సంస్కారహీనుడైన కేసీఆర్.. ఎవరినీ లెక్కచేయడని విమర్శించారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా స్పందించి టోకాల్ పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

మరిన్ని వార్తల కోసం:

నా సమస్యకు పరిష్కారం ఢిల్లీలోనే దొరుకుద్ది

మేడారం జాతర ఫొటో గ్యాలరీ