‘మసూద’ గోపీ గుర్తున్నాడుగా.. తిరువీర్ ప్రీ వెడ్డింగ్ షో టీజర్ వచ్చేసింది !

‘మసూద’ గోపీ గుర్తున్నాడుగా.. తిరువీర్ ప్రీ వెడ్డింగ్ షో టీజర్ వచ్చేసింది !

తిరువీర్ హీరోగా  రాహుల్ శ్రీనివాస్‌‌‌‌ దర్శకత్వంలో  సందీప్ అగ‌‌‌‌రం, అష్మితా రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’.  టీనా శ్రావ్య హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. నవంబర్ 7న సినిమా విడుదల కానుంది.  మంగళవారం  టీజర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌కు అతిథిగా హాజరైన దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ ‘టీజర్ చాలా ప్రామిసింగ్‌‌‌‌గా, సరదాగా  ఉంది. క్లీన్ ఫిల్మ్ అని అర్ధమవుతోంది.  నటీనటులంతా బాగా పెర్ఫార్మ్ చేశారు. తిరువీర్ ఇంటరెస్టింగ్ ప్రాజెక్టులు చేస్తూ వస్తున్నాడు. తను ఈ సినిమాతో మంచి హిట్ అందుకోవాలని కోరుకుంటున్నా. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ చాలా ఎనర్జిటిక్‌‌‌‌గా ఉంది. ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించాలని నిర్మాతలు, టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్’ అని చెప్పారు.

తిరువీర్ మాట్లాడుతూ ‘దర్శకుడు రాహుల్ కథ చెప్పడం స్టార్ట్ చేసి  పూర్తి చేసే వరకు నవ్వుతూనే ఉన్నాను. కథ నచ్చి రెమ్యూనరేషన్‌‌‌‌  తీసుకోకుండా డేట్స్ అడ్జెస్ట్ చేశాను. వేరే సినిమాతో క్లాష్ వచ్చినా ఇది మాత్రం కచ్చితంగా చేయాలని అనుకున్నా. యంగ్ టీమ్‌‌‌‌తో చేసిన ఈ సినిమా ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది’ అని చెప్పాడు. హేమ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లో ఆకట్టుకుంటానని  టీనా శ్రావ్య చెప్పింది.  దర్శకుడిగా నా కథను నమ్మిన తిరువీర్ గారికి థ్యాంక్స్ చెప్పాడు  దర్శకుడు  రాహుల్ శ్రీనివాస్.   ఆడియెన్స్‌‌‌‌ను ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్ చేసేలా ఈ చిత్రం ఉంటుందని నిర్మాతలు చెప్పారు. నటులు నరేంద్ర, యామిని, రోహన్,  మ్యూజిక్ డైరెక్టర్  సురేష్ బొబ్బిలి, ఎడిటర్ నరేష్​, డివోపీ సోమ శేఖర్  పాల్గొన్నారు.