
- జాగృతి అధ్యక్షురాలు కవిత
ట్యాంక్ బండ్, వెలుగు: దేశం మొత్తం తరతరాలుగా చెప్పుకునేలా కుమ్రంభీం గొప్ప పోరాటం చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొనియాడారు. కొంతమందికి జననం చరిత్ర అయితే.. మరి కొంతమందికి మరణం చరిత్ర అవుతుందని, కుమ్రంభీం మరణం ద్వారా ఆదివాసీలకు ఎన్నో హక్కులను సాధించి పెట్టారని పేర్కొన్నారు.
కుమ్రంభీం 85వ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం ఆదివాసి జాగృతి ఆధ్వర్యంలో అధ్యక్షులు లోకిని రాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి కవిత హాజరయ్యారు. ట్యాంక్ బండ్ పై కుమ్రంభీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కవిత మాట్లాడుతూ.. గుస్సాడి ఉత్సవాల ఏటా గూడానికి రూ.50 వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎల్.రూప్సింగ్, నవీన్ పాల్గొన్నారు.