అలా తాళి కట్టాడు.. ఇలా కొట్టాడు..

అలా తాళి కట్టాడు.. ఇలా కొట్టాడు..

ప్రపంచంలో ఏ మూలన ఉన్నా, మన సమాజం మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఒకరు సమర్థిస్తే.. మరొకరు నేరంగా పరిగణిస్తారు. కొన్నిసార్లు సమాజం పట్ల భయాన్ని పెంచేందుకు, పురుషుల ఆధిపత్యాన్ని చూపించుకునేందుకు ఇలాంటి నేరాలు కీలక పాత్ర పోషిస్తుంటాయి. ఈ తరహా ఘటనల్లో అవతలి వారి తప్పున్నా.. మౌనంగా ఉండమని పక్కనున్న వాళ్లు సలహా ఇస్తారు. ఇది మహిళలను బహిరంగంగా అవమానించడమే కాదు, వారు తప్పుల్ని ఎంచి, పోరాడలేరు అనే దానికి ఉదాహరణలుగా నిలుస్తూంటాయి. ఇలాంటి ఘటనే ఓపెళ్లి వేదికపై జరిగింది. పెళ్లి వేదికపై ఉండగానే వరుడు వధువును చెంప దెబ్బ కొట్టిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఉజ్బెకిస్థాన్‌కు చెందిన ఒక వీడియో @l_seiitbek అనే ట్విట్టర్ ఖాతాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పెళ్లి వేదిక వద్ద ఒక గేమ్‌లో ఓడిపోవడంతో కోపోద్రిక్తుడైన వరుడు, వధువును చెంపదెబ్బ కొట్టాడు. అక్కడున్న అబ్బాయిలు ఒక్కసారిగా నవ్వుకున్నారు. కానీ అదే సమయంలో వధువు మాత్రం వరుడు చేసిన పనికి  ఖంగుతిన్నది. ఈ వీడియో చాలా పాతదే అయినా మరోసారి వైరల్ అవుతోంది. దీనికి ఇప్పటివరకు17 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

పెళ్లికూతురును  కొట్టిన వరుడు..

వైరల్‌గా మారిన ఈ వీడియోలో పెళ్లి వేదికపై వధువు, వరుడి మధ్య గేమ్ జరుగుతోంది. ఆ గేమ్‌లో వరుడు ఓడిపోయి వధువు గెలిచింది. దీంతో ప్రశంసలు అందుకుంటున్న వధువును బంధువులు ఇంకా ఉత్సాహపరిచారు. దీంతో ఆ వరుడికి కోపం ఆకాశానికి చేరుకుంది. క్షణం ఆలోచించకుండా పెళ్లి వేదికపైనే వధువును చెంపదెబ్బ కొట్టాడు. ఈ ఘటనతో అప్పటివరకూ నవ్వుతున్న ముఖాలన్నీ ఒక్కసారిగా ప్రశాంతంగా మారాయి. పెళ్లికూతురు ముఖం మూగబోయింది. కానీ పెళ్లికొడుకు, అతని ఫ్రెండ్స్ మాత్రం సంతోషంగా ఉన్నారు.

ఇలాంటి హింసకు వ్యతిరేకంగా ఎవరూ ఎందుకు మాట్లాడరు?

చాలా మంది ఈ వీడియోపై తమ అభిప్రాయాన్ని తెలియజేస్తూ కామెంట్ చేస్తున్నారు. ఈ తరహా ఘటనలపై  కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కళ్ల ముందు ఇంత జరుగుతున్నా పక్కన ఉన్నవారెవరూ అభ్యంతరం చెప్పకపోవడం మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. వధువు కూడా కోప్పడకుండా సైలెంట్ గా ఉంది. అతను చేసిన పనికి ఎదురు చెప్పలేదు, ప్రశ్నించలేదు. దీంతో ఈ వీడియో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడే కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఆ వధువు పరిస్థితి ప్రారంభంలోనే ఇలా ఉంటే.. ఇక జీవితాంతం ఎంత దారుణందా ఉంటుందోనని కొంతమంది ఆవేదన వ్యక్చం చేస్తున్నారు. మరికొందరేమో వెంటనే వారిద్దరి వివాహాన్ని రద్దు చేయాలని కోరుతున్నారు.

https://twitter.com/l_seiitbek/status/1536067857309646855