Health Tips: డేట్స్ లో ఎన్ని విటమిన్స్ ఉంటాయో తెలుసా...? ఇవి తింటే ఇంకేమీ తినాల్సిన అవసరం ఉండదు..!

Health Tips: డేట్స్ లో ఎన్ని విటమిన్స్ ఉంటాయో తెలుసా...? ఇవి తింటే ఇంకేమీ తినాల్సిన అవసరం ఉండదు..!

ఏక్కువ విటమిన్స్ ఉండే ఫ్రూట్స్ లో ఖర్జూరం కూడా ఒకటి డ్రైఫల్ రూపంలో ఎప్పుడూ దొరికే ఎండు ఖర్జూరం కంటే రంజాన్ టైంలో దొరికే డేట్స్ చాలా టేస్టీగా, జ్యూసీగా ఉంటాయి. అయితే ఎండు ఖర్జూరాలను నానబెట్టి చేసే 'పేండ్ ఖజూర్' కాకుండా. నిండుగా పండులా కనిపించే డేట్స్ చాలా టేస్టీగా ఉంటాయి. కాస్త ధర ఎక్కువైనా వాటిని ఈ సీజన్లో ఓసారైనా టేస్ట్ చేయండి. ఎందుకంటే డేట్స్ లో కొలెస్ట్రాల్ అసలు ఉండదు. అందుకే స్నాక్స్ గా తింటూ ఎంజాయ్ చెయ్యొచ్చు. చాలా స్వీట్ గా ఉంటాయి. కాబట్టి చక్కెరకు బదులుగా కూడా వాడుకోవచ్చు. 

డేట్స్ లో బీ-1,2,3.5 విటమిన్స్ తోపాటు ఎ-1, సి విటమిన్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి తింటే విటమిన్స్ కోసం ఇంకేదీ తినాల్సిన అవసరమే ఉండదు. దేల్స్ రెగ్యులర్ తినేవాళ్లలో ఎనర్జీ లెవల్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే ఉపవాసం ఉన్నవాళ్లు డేట్స్ ను కంపల్సరీగా తింటారు. 

అంతేకాకుండా డేట్స్ సెలీనియం, మాంగనీస్, కాపర్, మెగ్నీషియం వంటి మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. అవి ఎముకలకు అవసరమైన బలాన్ని ఇవ్వడమే కాకుండా అస్టియోపొరాసిస్ రాకుండా చేస్తాయి. జీర్ణసమస్యలు ఉన్నవాళ్లు మలబద్దకం, ఎసిడిటీ ఉన్నవాళ్లకు డేట్స్ మంచి మెడిసిన్. చర్యాన్ని సాఫ్ట్ గా, కాంతివంతంగా ఉంచుతాయి. జుట్టు సమస్యలు కూడా దూరసువుతాయి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న డేట్స్ ను బాగా దొరికే. ఈ టైంలో తప్పనిసరిగా తినాలి.