నాలుగు జిల్లాలకు మలేరియా ముప్పు

నాలుగు జిల్లాలకు మలేరియా ముప్పు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నాలుగు జిల్లాలకు మలేరియా ముప్పు ఉందని ఆరోగ్య శాఖ గుర్తించింది. వర్షాకాలం సమీపిస్తున్నందున సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై యాక్షన్ ప్లాన్ రూపొందించింది. కుమ్రంభీం ఆసిఫాబాద్, జయశంకర్‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో మలేరియా వ్యాప్తి ఎక్కువయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాల్లో దోమల నివారణపై ఎక్కువ దృష్టి పెట్టాలని నిర్ణయించింది. రోగుల గుర్తింపు, చికిత్సకు సంబంధించి హాస్పిటళ్లను సిద్ధం చేయాలని ఆయా జిల్లాల డీఎంహెచ్‌‌‌‌వోలను ఆదేశించింది. హైదరాబాద్, మహబూబాబాద్, వరంగల్‌‌‌‌, హనుమకొండ జిల్లాలు మలేరియా ఫ్రీ ఎలిమినేషన్ స్టేజ్‌‌‌‌లో ఉన్నాయని, ఇక్కడ అర్బన్ ఏరియాలపై ఎక్కువ ఫోకస్ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో గతేడాది 881 మలేరియా కేసులు నమోదుకాగా, ఈ ఏడాది ఇప్పటివరకు 42 కేసులు వచ్చాయి.