కరోనా బులిటెన్ రోజూ ఇవ్వాల్సిందే: హైకోర్టు

కరోనా బులిటెన్ రోజూ ఇవ్వాల్సిందే: హైకోర్టు

ప్రతి రోజూ కరోనా బులెటిన్ విడుదల చేయాల్సిందేనని ఆదేశించింది హైకోర్టు. రాష్ట్రంలో వీలైనంత త్వరగా సీరం సర్వే చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సర్వే నివేదిక సిఫార్సులు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారించింది. కరోనా పరీక్షలపై  ప్రభుత్వం నివేదిక  ఇచ్చింది. జనవరి 25 నుంచి ఈనెల 12 వరకు జరిపిన పరీక్షల వివరాలు తెలిపింది. ఆర్ టీపీసీఆర్ 1,03,737, రాపిడ్ యాంటీ జెన్ పరీక్షలు 4,83,266 జరిపినట్లు చెప్పింది. జూన్ 3 నుంచి డిసెంబరు వరకు 3 సీరం సర్వేలు జరిగాయని కోర్టుకు తెలిపింది. ఈ సందర్బంగా రెండో దశ కరోనా కేసులు పెరిగే ప్రమాదం పొంచి ఉన్నదని హెచ్చరించింది హైకోర్టు. మహారాష్ట్ర, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయన్న కోర్టు.. ప్రజలు ఎక్కువ సంఖ్యలో గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ విధానం విస్తృత ప్రచారం చేయాలని సూచిస్తూ..తదుపరి విచారణను మార్చి 18కి వాయిదా వేసింది.