ఖానామేట్ భూములు వారివే

ఖానామేట్ భూములు వారివే

హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి ఖానామెట్‌‌లోని 26.16 ఎకరాల హక్కులు తమవేనంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌‌ పిటిషన్‌‌ను హైకోర్టు డిస్మిస్‌‌ చేసింది. గతంలో సింగిల్‌‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్‌‌ చేసిన ప్రభుత్వం బుధవారం డివిజన్‌‌ బెంచ్‌‌ కొట్టేసింది. ఆ భూములు సినీరంగ ప్రముఖలు దగ్గుబాటి రామానాయుడు ఫ్యామిలీ మెంబర్స్, డైరెక్టర్‌‌‌‌ కె.రాఘవేందర్‌‌రావు, గోవింద్‌‌రెడ్డి ఇతరులకే చెందుతాయని తీర్పు చెప్పింది. ఈ భూముల వ్యవహారంలో రాష్ట్ర సర్కార్‌‌ జోక్యం చేసుకోరాదని, అనుబంధ స్వేతార్‌‌ రద్దు చేసి భూముల స్వాధీనానికి ప్రయత్నించరాదన్న సింగిల్‌‌ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు డివిజన్‌‌ బెంచ్‌‌ నిరాకరించింది. ఈ మేరకు చీఫ్‌‌ జస్టిస్‌‌ ఉజ్జల్‌‌ భూయాన్, జస్టిస్‌‌ ఎస్‌‌.నంద డివిజన్‌‌ బెంచ్‌‌ బుధవారం తీర్పు చెప్పింది.