పబ్ లకు హైకోర్టు షాక్​ 

పబ్ లకు హైకోర్టు షాక్​ 

హైదరాబాద్​ : న్యూ ఇయర్​ సందర్భంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లోని పబ్ లకు హైకోర్టు షాక్ ఇచ్చింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై మరోసారి పబ్ నిర్వాహకులు కోర్టును ఆశ్రయించారు. పబ్ ల వ్యవహారంపై హైకోర్టులో విచారణ సాగింది.

జూబ్లీహిల్స్ లో ఉన్న 10 పబ్ లు రాత్రి 10 తర్వాత మ్యూజిక్ పెట్టరాదని హైకోర్టు ఆదేశించింది. 10 పబ్బుల్లో న్యూ ఇయర్ ఈవెంట్స్ లోనూ 10 తరువాత సౌండ్ పెట్టరాదని పేర్కొంది. గతంలో ఇచ్చిన ఆర్డర్ నే న్యాయస్థానం సమర్థించింది.