హైకోర్టు ఉత్తర్వులు జారీ

హైకోర్టు ఉత్తర్వులు జారీ

హైదరాబాద్, వెలుగు : నర్సింగ్‌ కాలేజీలు జీఎస్టీ చెల్లించాలని ప్రభుత్వ అధికారులు ఒత్తిడి చేయరాదని రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెరో 9 శాతం చొప్పున జీఎస్టీ చెల్లించాలని కేర్‌ కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌ కాలేజీతో పాటు మరో 9 నర్సింగ్‌ కాలేజీలకు కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ  నోటీసులిచ్చింది. ఎగ్జామ్స్‌ పెట్టడం, పేపర్లు రెడీ చేయడం వంటి సేవల నిమిత్తం జీఎస్టీ కట్టాలని స్పష్టం చేసింది. ఈ నోటీసులను సవాలు చేస్తూ కాలేజీలు కోర్టులో రిట్లను దాఖలు చేశాయి. వీటిని చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌భూయాన్, జస్టిస్‌ భాస్కర్‌రెడ్డిల డివిజన్‌ బెంచ్‌ సోమవారం విచారించింది.