
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. ఎంట్రన్స్ ఎగ్జామ్స్, డిగ్రీ, పీజీ పరీక్షల్ని ఆన్‌లైన్ లేదా బ్లయిండ్ మోడ్ పద్ధతుల్లో ఎందుకు నిర్వహించలేరని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. స్టూడెంట్లు ఎవరైనా కరోనాతో ఎగ్జామ్స్ రాయకపోతే వాళ్లకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ పెట్టడమే కాకుండా.. అందులో పాస్ అయితే రెగ్యులర్ గా పరిగణిస్తారో లేదో చెప్పాలని సూచించింది. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బీవీ నర్సింగరావు, ఇతరులు వేసిన పిల్ పై.. చీఫ్ జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డిల బెంచ్ గురువారం విచారించింది. ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించలేమని సర్కారు తరఫున ఏజీ కోర్టుకు చెప్పారు. అయితే ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ ఆన్లైన్లోనే పెట్టారని పిటిషనర్ లాయర్ కోర్టుకు చెప్పారు. దీంతో బెంచ్ వివరణ ఇవ్వాలని సర్కారును ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది.