2 వేల ఎకరాల HCU భూమి 1300 ఎకరాలకు తగ్గింది

2 వేల ఎకరాల HCU భూమి 1300 ఎకరాలకు తగ్గింది

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో రోడ్డు వేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.   అనుమతి లేకుండా రోడ్డు వేయడంపై హెచ్ సీయూ  స్టూడెంట్స్ హైకోర్టును ఆశ్రయించారు. హెచ్ సీయూలో  ప్రభుత్వ రోడ్డు నిర్మాణంపై హైకోర్టు విచారణ జరిపిన హైకోర్టు యూనివర్సిటీ భూమిలో రోడ్డు ఎలా వేస్తారని ప్రశ్నించింది.  భూసేకరణ చేయకుండా.. 2 వేల ఎకరాల హెచ్ సీయూ భూమి 1300 ఎకరాలకు తగ్గిందని చెప్పింది.  చట్టప్రకారం భూ సేకరణ చేసుకోవాలని సూచించింది.  అప్పటివరకూ  హెచ్ సీయూ భూమిలోకి ప్రవేశించకూడదని ఆదేశిచింది. హెచ్ సీయూలో  ప్రభుత్వ రోడ్డు నిర్మాణం పై స్టేటస్ కో విధించింది హైకోర్టు.

వర్సిటీ భూముల్లో రూపుదిద్దుకున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కాలనీకి దారి కోసం కొంత స్థలం ఇవ్వాలని వర్సిటీ అధికారులను కోరగా నిరాకరించారు. విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళన చేస్తున్నా లెక్క చేయకుండా విశ్వవిద్యాలయ ప్రహరీని ఇటీవల బలవంతంగా కూల్చివేశారు. కి.మీ.కుపైగా పొడవున 18.3 ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు. రాత్రికి రాత్రే చదును చేసి మూడు రోజుల వ్యవధిలో తారు రోడ్డు నిర్మించారు. వర్శిటీ అధికారులు దీనిపై హైకోర్టును ఆశ్రయించగా కోర్టు స్టేటస్‌కో ఇచ్చింది.

రికార్డుల్లో ఇప్పటికీ సర్కారీ భూములే!

హెచ్‌సీయూ కోసం 2324 ఎకరాల భూమిని కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ వర్సిటీ పేరిట మ్యుటేషన్‌ చేయలేదు. రెవెన్యూ రికార్డుల్లో ఈ భూమి ఇప్పటికీ ప్రభుత్వ భూమిగానే ఉంది. ఈ విషయంపై విశ్వవిద్యాలయ అధికారులు నాలుగైదుసార్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖలు రాశారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలకు చెందిన భూములను కేంద్ర కేబినెట్‌ సెక్రెటరీ అనుమతి లేకుండా ఎవరికీ కేటాయించడానికి వీల్లేదంటూ కేంద్రం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. అయినా హెచ్‌సీయూకి చెందిన 18.3 ఎకరాలను ఏకపక్షంగా కేటాయించడంపై పెద్దఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంపై మాట్లాడటానికి వర్సిటీ ఉన్నతాధికారులు సుముఖత చూపలేదు.

ప్రభుత్వ భూమి కావడం వల్లే..

హెచ్‌సీయూ అధీనంలోని భూములన్నీ ప్రభుత్వ భూములే. అందువల్లే కొంత భూమిని రోడ్డుకు కేటాయించాం. దీనిపై వివాదం చేయాల్సిన అవసరం లేదు.- చంద్రకళ, ఆర్డీవో, రాజేంద్రనగర్

సంస్థల వారీగా హెచ్‌సీయూ భూముల కేటాయింపు    –      ఎకరాల్లో

ఐఎంజీ భరత                                                            400 (తరవాత వెనక్కి తీసుకున్నారు)

టీఎన్‌జీవోలకు                                                           134.28

స్పోర్ట్స్‌ అథారిటీకి                                                        117.13

తహసీల్దారు, ఇతరుల కోసం                                            9

రంగారెడ్డి జిల్లా కేంద్రం కోసం                                             62

(ఈ భూములను ఐఐఐటీకి ఇచ్చారు)

టీఐఎఫ్‌ఆర్‌                                                               191.01

ఎన్‌ఐడీ                                                                   30

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యానిమల్‌ బయోటెక్నాలజీ       100

ఎనర్జీ రిసోర్సు ఇన్‌స్టిట్యూట్‌                                          40

ఇతరులు                                                                 21

see more news

లక్షా 32 వేల ఉద్యోగాలిచ్చాం.. ఎక్కడైనా చర్చకు రెడీ

ఈ ఎన్నికల్లో గెలిస్తేనే భవిష్యత్.. మంత్రులపై కేటీఆర్ సీరియస్