
కాబూల్: ఘనీ పాలనలో ఆమె ఓ పోలీసు ఆఫీసర్.. తాలిబాన్ల ఆక్రమ ణ తర్వాత ఇంట్లనే ఉంటోంది. ఆమెను వెతుక్కుంటూ శనివారం రాత్రి ముగ్గురు తాలిబాన్లు ఇంటికి వచ్చిన్రు. ఆరు నెలల గర్భవతి అని కూడా చూడకుండా భర్త, పిల్లల ముందే కాల్చేసిన్రు. ఘోర్ ప్రావిన్స్ లోని ఫిరోజ్కోహ్లో జరిగిన ఈ దారుణంలో ఉమెన్ పోలీస్ బాను నిగారా చనిపోయారు. లోకల్ జర్నలిస్టు ఒకరు ట్వీట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇది తాలిబాన్ల పనేనని కుటుంబం ఆరోపిస్తుండగా.. మేం కాదు, వ్యక్తిగత కక్షలతోనే జరిగి ఉండొచ్చ ని తాలిబాన్లు అంటున్నరు. హెరాత్ ప్రావిన్స్‌లో జరుగుతున్న మహిళల నిరసనలను అణచివేయాలని ప్రయత్నించిన తాలిబాన్లు.. వారం లోపే ఓ మహిళా పోలీసును కాల్చి చంపేశారు. దీంతో బుర్ఖాలు లేకుండా కనిపిస్తే తాలిబాన్లు కాల్చేస్తారనే భయంతో మహిళలు వాటిని కొనుగోలు చేస్తున్నారని రష్యన్ మీడియా వెల్లడించింది.