
హైదరాబాద్, వెలుగు: ప్రేమించి పెండ్లి చేసుకున్న భార్యను అనుమానంతో హత్య చేశాడో భర్త. బాలాపూర్‌మండలం జల్‌పల్లిశ్రీరామ్ కాలనీలో ఉండే మండల వరలక్ష్మి(26), నాగరాజు రెండేం డ్లకిందట లవ్‌మ్యారేజ్ చేసుకున్నారు. వీరికి ఒక బాబు ఉన్నాడు. కొద్దిరోజులుగా వరలక్ష్మి ని అనుమానిస్తూ నాగరాజు వేధిస్తున్నాడు. మంగళవారం తెల్లవారుజామున తల పగులగొట్టిచంపాడు. వరలక్ష్మి తల్లిపద్మ పోలీసులకు కంప్లయింట్ తో పహాడీషరీఫ్ పోలీసులు వచ్చి డెడ్బాడీని ఉస్మానియాకు తరలించారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నా రు. నిందితుడు పరారీలో ఉన్నాడు. కాగా, వరలక్ష్మి ఇప్పటికే 8 పెళ్లిళ్లు చేసుకున్నట్లు తెలిసింది.