రానున్న మూడు రోజులు వర్షాలు

రానున్న మూడు రోజులు వర్షాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు కామారెడ్డి జిల్లా గాంధారిలో 9.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే జిల్లా వర్నిలో 9 సెం.మీ., తాడ్వాయిలో 8.9, కామారెడ్డిలో 8.8 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.